RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, జులై 2023, శుక్రవారం

ఆడించదా వయసు పాడించదా | Adinchada vayasu | Song Lyrics | Andala Rasi (1980)

ఆడించదా వయసు పాడించదా



చిత్రం :  అందాల రాశి (1980)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు  



పల్లవి :


ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా



చరణం 1 :


చురుకు చురుకు ఆడపిల్ల చూపులు... 

ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు

చురుకు చురుకు ఆడపిల్ల చూపులు... 

ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు


రెండిటికి బంధమేసి ఇద్దరినీ ఒకటి చేసి

ముద్దొచ్చే పండుగలో మురిపించదా...

హాయి కురిపించదా... మేను మరపించదా



ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా 



చరణం 2 :



రమణిలోన ఉంటుందొక రాధా... 

మమత ఉన్న మనిషే మాధవుడు

రమణిలోన ఉంటుందొక రాధా... 

మమత ఉన్న మనిషే మాధవుడు


ఈడుజోడు కుదిరితే తోడునీడ కుదిరితే...

వేడుకగా ప్రేమగీతి పలికించదా

తనివి ఒలికించదా... బ్రతుకు పులకించదా


ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన | Guttapalli Chelalona | Telugu Folk Song Lyrics | RKSS Creations

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన జానపద గేయం  రచన : రామకృష్ణ దువ్వు  పల్లవి :  గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన పాలకంకి సొగసులున్న నవరంగీ గుత్త...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు