RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
driver ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
driver ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2023, సోమవారం

ఏమనీ వర్ణంచనూ | Emani Varninchanu | Song Lyrics | Driver Ramudu (1978)

ఏమనీ వర్ణంచనూ



చిత్రం: డ్రైవర్‌ రాముడు (1978)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి:


ఏమనీ వర్ణంచనూ..ఊ..ఊ

ఏమనీ వర్ణించనూ..ఊ..ఊ..

నీ కంటి వెలుగునూ..వెన్నంటి మనసునూ..

వెన్నెల నవ్వునూ..నీ ఇలవేల్పునూ..

ఏమనీ వర్ణించనూ..


ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆ..ఆ


చరణం 1:


పైర గాలిలాగా..చల్లగా వుంటాడూ...

తెల్లారి వెలుగులా..వెచ్చగా వుంటాడు..

పైర గాలిలాగా..చల్లగా వుంటాడూ

తెల్లారి వెలుగులా..వెచ్చగా వుంటాడు..

తీర్చిన బొమ్మలా తీరైన వాడు

తీర్చిన బొమ్మలా తీరైన వాడు

తీరని ఋణమేదో తీర్చుకో వచ్చాడు


ఏమనీ వర్ణంచనూ..ఆ..ఆ...


చరణం 2:


రాముడు కాడమ్మా..ఆ.. నిందలు నమ్మడు..

కృష్ణుడు కాడమ్మ.. సవతులు ఉండరు...


నీవు పూజించే దేవుళ్ళ లోపాలు లేని వాడు..ఊ..ఊ

నీ పూజ ఫలియించి నీ దేవుడయినాడు..

నీ పూజ ఫలియించి నీ దేవుడయినాడు..

ఏమనీ వర్ణించనూ..ఊ..ఊ


చరణం 3:


ఆఅ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ


కళ్ళు లేవనీ నీకు కలతింక వలదమ్మ...

తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా...

కళ్ళు లేవనీ నీకు కలతింక వలదమ్మ...

తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా...


ఆ దేవుడు ఎదురయితే..వేరేమి కోరను

ఆ దేవుడు ఎదురయితే..వేరేమి కోరను

నా అన్న రూపాన్ని చూపితే చాలును..


ఏమనీ ఊహించనూ..ఊ..

నా అన్న రూపును..నాకున్న వెలుగును..

వెన్నంటి మనసును.. నా ఇలవేల్పును..

ఏమనీ ఊహించనూ..ఊ..ఊ..ఊ


పాటల ధనుస్సు 


6, ఏప్రిల్ 2023, గురువారం

మావిళ్ళ తోపు కాడ పండిస్తే | Mavilla thopukada | Song Lyrics | Driver Ramudu (1978)

మావిళ్ళ తోపు కాడ పండిస్తే



చిత్రం: డ్రైవర్‌ రాముడు (1978)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


ఆ రైట్..రైట్..


మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ

మరుమల్లె తోట కాడ పువ్విస్తే..

మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ

మరుమల్లె తోట కాడ పువ్విస్తే..

ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి

ఎత్తికుదేశాడే..

అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..

అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..

అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..


నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ

నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..

నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ

నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..

ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి

ముద్దిచ్చిపోవేమే..

బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే

అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..

బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే


పాం..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్


చరణం 1:


ఘజ్జల్ల గుర్రమంటి కుర్రదానా..ఆ

ఈ మద్దెళ్ళు ఆపలేనే మనసులోనా..ఆ..ఆ

సజ్జ చేనల్లే ఎదిగి ఉన్నదానా..ఆ..

ఈ పిట్ట పొగరు చూడవేమే..ఏ..ఏ..ఏ వయసులోనా


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

మునిమాపు వేళకొస్తే..ముడుపులన్ని కట్టేస్తా..

చుక్కపొడుపు చూసి వస్తే..మొక్కులన్నీ తీరుస్తా...

వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా..ఆ..ఆ

వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా...


ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి

ముద్దిచ్చిపోవేమే..

బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే..ఏ

అమ్మమ్మో..

ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..

పా్..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్


చరణం 2:


ఏడు నిలువులెత్తు ఉన్న కోడెగాడా..ఆ..ఆ..!! ఆహా..

నీ చుట్టుకొలత చూడలేను బీడుగాడా..!! ఓహోహో..

దిక్కులన్ని ఒక్కటయిన చక్కనోడా...ఆ

నీ ట్రక్కు జోరు ఈడ కాదూ...ఊ..ఊ..ఇంటికాడ..


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పంట కెదిగే..వయసు కాస్త కుప్ప వేసి ఊడ్చేస్తా..

జంటకొదిగే సొగసులన్నీ..ఇప్పుడే నే కాజేస్తా..ఆ

వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..ఆ..ఆ

వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..


ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..

అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..

అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..హ్హే..హ్హే..హ్హే..


నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ

నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..

నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ

నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..

ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి

ముద్దిచ్చిపోవేమే..

బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే

అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..

బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే


పాం..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్


పాటల ధనుస్సు  





5, ఏప్రిల్ 2023, బుధవారం

వంగమాకు వంగమాకు | Vangamaku vangamaku | Song Lyrics | Driver Ramudu (1978)

వంగమాకు వంగమాకు



చిత్రం: డ్రైవర్‌ రాముడు (1978) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


దొంగా..ఆ..ఆ. అమ్మో..ఓ.. 

అరెరెరె..వంగమాకు..వంగమాకు.. 

వంగి..వంగి దొంగలాగ పాకమాకు 

వంగమాకు..వంగమాకు.. 

వంగి..వంగి దొంగలాగ పాకమాకు 

వంగుతుంటే కొంగులోని..

గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా..ఓ..ఓ 

వంగమాకు.. 


లాగమాకు లాగమాకు లాగిలాగి 

పైటకొంగు జారనీకు 

లాగమాకు..ఆహ. లాగమాకు 

లాగిలాగి పైటకొంగు జారనీకు 

లాగుతుంటే కొంగు చాటు..

గుట్టంత రట్టయ్యో రామయ్యో..ఓ..ఓ..లాగమాకు 


చరణం 1: 


ఈతముళ్ళు.. అబ్బా... 

గుచ్చుకుంటే.. అమ్మో.. 

పువ్వులాంటి లేత వళ్ళు గాయం.. 

ఈతముళ్ళూ..ఊ..ఊ గుచ్చుకుంటే..ఏ.. 

పువ్వులాంటి లేత వళ్ళు గాయం 

తోటమాలి చూశాడా..ఆ..ఆ..

బడితపూజ కాయం.. 


మాలి నాకు మామేలే..తోట కూడ మాదేలే.. 

డండఢ డాఢ డడడడ దణ్డడ..డండడ..డడ 

మాలి నాకు మామేలే..తోట కూడ మాదేలే.. 

ముల్లయినా నన్ను తాకి పువ్వయిపోతుందిలే.... 

రామయ్యో..ఓ..ఓ..వెళ్ళి రావయ్యో..ఆహా 

రామయ్యో..ఓ..ఓ..వెళ్ళి రావయ్యో అరెరెరె 


వంగమాకు..వంగమాకు.. 

వంగి..వంగి దొంగలాగ పాకమాకు 


లాగమాకు లాగమాకు లాగిలాగి 

పైటకొంగు జారనీకు 

లాగమాకు. 


చరణం 2: 


చేను మీద చొరవచేస్తే..చెంపమీద 

చేతి ముద్ర ఖాయం 

చేను మీద అహ్హా.. చొరవచేస్తే..ఓహ్హో..

చెంపమీద చేతి ముద్ర ఖాయం 

నేను గొడవ చేశానా..ఆ..ఆ..ఆ..ఆ..

ఎవరు నీకు సాయం.. 


ఆడ చెయ్యి తగిలితే..హాయి నాకు కలిగితే.. 

డడ్డర డడ్డడడ్డా..డడ్డర డడ్డడడ్డా.. 

ఆడ చెయ్యి తగిలితే..హాయి నాకు కలిగితే.. 

వంగ తోటలో సరసం..వరసే అవుతుందిలే..ఏ 


చుక్కమ్మో..ఓ..ఓ..ఓ.. నాకు చిక్కమ్మో.. 

వ్వె..వ్వే..వ్వే..వ్వే.. ఆ చుక్కమ్మో నాకు చిక్కమ్మో.. 




వంగి..వంగి దొంగలాగ పాకమాకు 

వంగమాకు..వంగమాకు.. 

వంగి..వంగి దొంగలాగ పాకమాకు 

వంగుతుంటే కొంగులోని..

గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా..ఓ..ఓ 

వంగమాకు.. 


లాగమాకు లాగమాకు లాగిలాగి 

పైటకొంగు జారనీకు 

లాగమాకు..ఆహ. లాగమాకు లాగిలాగి 

పైటకొంగు జారనీకు 

లాగుతుంటే కొంగు చాటు..

గుట్టంత రట్టయ్యో రామయ్యో..ఓ..ఓ..లాగమాకు


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు