మావిళ్ళ తోపు కాడ పండిస్తే
చిత్రం: డ్రైవర్ రాముడు (1978)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
ఆ రైట్..రైట్..
మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ
మరుమల్లె తోట కాడ పువ్విస్తే..
మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ
మరుమల్లె తోట కాడ పువ్విస్తే..
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ఎత్తికుదేశాడే..
అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..
అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..
బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..
బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
పాం..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్
చరణం 1:
ఘజ్జల్ల గుర్రమంటి కుర్రదానా..ఆ
ఈ మద్దెళ్ళు ఆపలేనే మనసులోనా..ఆ..ఆ
సజ్జ చేనల్లే ఎదిగి ఉన్నదానా..ఆ..
ఈ పిట్ట పొగరు చూడవేమే..ఏ..ఏ..ఏ వయసులోనా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మునిమాపు వేళకొస్తే..ముడుపులన్ని కట్టేస్తా..
చుక్కపొడుపు చూసి వస్తే..మొక్కులన్నీ తీరుస్తా...
వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా..ఆ..ఆ
వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా...
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..
బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే..ఏ
అమ్మమ్మో..
ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
పా్..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్
చరణం 2:
ఏడు నిలువులెత్తు ఉన్న కోడెగాడా..ఆ..ఆ..!! ఆహా..
నీ చుట్టుకొలత చూడలేను బీడుగాడా..!! ఓహోహో..
దిక్కులన్ని ఒక్కటయిన చక్కనోడా...ఆ
నీ ట్రక్కు జోరు ఈడ కాదూ...ఊ..ఊ..ఇంటికాడ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పంట కెదిగే..వయసు కాస్త కుప్ప వేసి ఊడ్చేస్తా..
జంటకొదిగే సొగసులన్నీ..ఇప్పుడే నే కాజేస్తా..ఆ
వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..ఆ..ఆ
వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..
ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..
అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..హ్హే..హ్హే..హ్హే..
నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..
బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..
బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
పాం..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి