అమ్మ ప్రేమకు మారు పేరు
చిత్రం : రామబాణం (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు
పల్లవి :
అమ్మ... ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు
అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు
ఆ పేరు నీడ సోకగానే...
నూరు జన్మల సేదతీరు
చరణం 1 :
మండువేసవిలో ముంగిట వెలసిన...
మంచుకొండ మా అమ్మ
పవలురేయి ఆరక వెలిగే
పరంజ్యోతి మా అమ్మ
ఆలనకైనా పాలనకైనా...
ఆలనకైనా పాలనకైనా...
ఆదిదేవత మా అమ్మ
అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు
చరణం 2 :
జన్మజన్మలా పున్నెము వలన...
నీ కమ్మని కడుపున పుట్టాను
మళ్ళీ జన్మలు ఎన్నున్నా...
నా తల్లివి నీవే అంటాను
కలలోనైనా మెలకువనైనా...
కలలోనైనా మెలకువనైనా...
నీ దీవనలే కోరుకుంటాను
అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు
ఆ పేరు నీడ సోకగానే...
నూరు జన్మల సేదతీరు
అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి