కన్నతల్లులు కథ చెబుతారు
చిత్రం : సీత గీత దాటితే (1977)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
కన్నతల్లులు కథ చెబుతారు...
చిన్నపిల్లలు ఊ కొడతారు
ఊ అనలేవు.. ఏమనలేవు..
నా కథ నీకు ఎలా చెప్పను...
కన్నతల్లులు కథ చెబుతారు...
చిన్నపిల్లలు ఊ కొడతారు
ఊ అనలేవు.. ఏమనలేవు..
నా కథ నీకు ఎలా చెప్పను...
కన్నతల్లులు కథ చెబుతారు...
చరణం 1 :
నాలుగే గోడలు అన్ని ఇళ్ళకు...
ఒక్కటే గడపరా లోనకు బయటకు
మాట గానీ మనిషి గానీ దాట రాదు వాటిని
పరుల తప్పు దాటేందుకె మనసు ఉన్నది
కన్నతల్లులు కథ చెబుతారు...
చిన్నపిల్లలు ఊ కొడతారు
ఊ అనలేవు.. ఏమనలేవు..
నా కథ నీకు ఎలా చెప్పను...
చరణం 2 :
నాన్న లేని వాడంటే నవ్వుతారు..
నలుగురు నవ్వుతారు
అమ్మ లేకపోతే పాపమంటారు...
అయ్యో పాపమంటారు
నాన్న బిడ్డగానే నువ్వు ఉండిపోరా...
ఈ మచ్చపడిన అమ్మ మాట మరచిపోరా...
కన్నతల్లులు కథ చెబుతారు...
చిన్నపిల్లలు ఊ కొడతారు
ఊ అనలేవు.. ఏమనలేవు..
నా కథ నీకు ఎలా చెప్పను...
కన్నతల్లులు కథ చెబుతారు...
చిన్నపిల్లలు ఊ కొడతారు
ఊ అనలేవు.. ఏమనలేవు..
నా కథ నీకు ఎలా చెప్పను...
కన్నతల్లులు కథ చెబుతారు...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి