ఏమనీ వర్ణంచనూ
చిత్రం: డ్రైవర్ రాముడు (1978)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
ఏమనీ వర్ణంచనూ..ఊ..ఊ
ఏమనీ వర్ణించనూ..ఊ..ఊ..
నీ కంటి వెలుగునూ..వెన్నంటి మనసునూ..
వెన్నెల నవ్వునూ..నీ ఇలవేల్పునూ..
ఏమనీ వర్ణించనూ..
ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆ..ఆ
చరణం 1:
పైర గాలిలాగా..చల్లగా వుంటాడూ...
తెల్లారి వెలుగులా..వెచ్చగా వుంటాడు..
పైర గాలిలాగా..చల్లగా వుంటాడూ
తెల్లారి వెలుగులా..వెచ్చగా వుంటాడు..
తీర్చిన బొమ్మలా తీరైన వాడు
తీర్చిన బొమ్మలా తీరైన వాడు
తీరని ఋణమేదో తీర్చుకో వచ్చాడు
ఏమనీ వర్ణంచనూ..ఆ..ఆ...
చరణం 2:
రాముడు కాడమ్మా..ఆ.. నిందలు నమ్మడు..
కృష్ణుడు కాడమ్మ.. సవతులు ఉండరు...
నీవు పూజించే దేవుళ్ళ లోపాలు లేని వాడు..ఊ..ఊ
నీ పూజ ఫలియించి నీ దేవుడయినాడు..
నీ పూజ ఫలియించి నీ దేవుడయినాడు..
ఏమనీ వర్ణించనూ..ఊ..ఊ
చరణం 3:
ఆఅ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ
కళ్ళు లేవనీ నీకు కలతింక వలదమ్మ...
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా...
కళ్ళు లేవనీ నీకు కలతింక వలదమ్మ...
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా...
ఆ దేవుడు ఎదురయితే..వేరేమి కోరను
ఆ దేవుడు ఎదురయితే..వేరేమి కోరను
నా అన్న రూపాన్ని చూపితే చాలును..
ఏమనీ ఊహించనూ..ఊ..
నా అన్న రూపును..నాకున్న వెలుగును..
వెన్నంటి మనసును.. నా ఇలవేల్పును..
ఏమనీ ఊహించనూ..ఊ..ఊ..ఊ
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి