కురిసింది వానా.. నా గుండెలోనా..
చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం : సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
కురిసింది వానా.. నా గుండెలోనా..
నీ చూపులే జల్లుగా..
కురిసింది వానా.. నా గుండెలోనా..
నీ చూపులే జల్లుగా..
ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు..
కురిసింది వానా.. నా గుండెలోనా..
నీ చూపులే జల్లుగా..
చరణం 1:
అల్లరి చేసే.. ఆశలు నాలో..
పల్లవి పాడేనూ..ఊ..ఊ..
తొలకరి వయసు.. గడసరి మనసు..
నీ జత కోరేనూ..ఊ..ఊ..
అల్లరి చేసే.. ఆశలు నాలో.. పల్లవి పాడేను..
చలి గాలి వీచే.. గిలిగింత తోచే..
కురిసింది వానా.. నా గుండెలోనా..
నీ చూపులే జల్లుగా..
చరణం 2:
ఉరకలు వేసే.. ఊహలు నాలో..
గుసగుస లాడేనూ..ఊ..ఊ..
కథలను తెలిపే.. కాటుక కనులు..
కైపులు రేపేనూ..ఊ..ఊ..
ఉరకలు వేసే.. ఊహలు నాలో..
గుసగుస లాడేను..
బిగువు ఇంకేలా.. దరికి రావేలా..
కురిసింది వానా.. నా గుండెలోనా..
నీ చూపులే జల్లుగా..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి