నీలి మేఘమా జాలి చూపుమా
చిత్రం: అమ్మాయిల శపథం (1975)
సంగీతం: విజయ్ భాస్కర్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, వాణీ జయరాం
పల్లవి:
నీలి మేఘమా జాలి చూపుమా
ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి
నన్ను కలిపి వెళ్ళుమా
కన్నె అందమా కలత మానుమా
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము
యెదుట నిలిచె చూడుమా
చరణం 1:
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
కలలు పండి నిజముగా
కనుల యెదుట నిలిచెగా
రా.. జాబిలి నా నెచ్చలి..
జాగేల... ఈ వేళ.. నను చేరగా
నీలి మేఘమా జాలి చూపుమా..
ఒక నిముషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి
నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ
చరణం 2:
కళ్యాణ మేళాలు మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
కళ్యాణ మేళాలు మ్రోగించనా..
కంఠాన సూత్రాన్ని ముడివేయనా..
గుండె గుడిగా చేయనా..
నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై... సావాసినై...
నా ప్రేమ పుష్పాల పూజించనా...
కన్నె అందమా కలత మానుమా
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము
యెదుట నిలిచె చూడుమా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి