అయ్యప్ప దేవాయ నమః
చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు
పల్లవి:
అయ్యప్ప దేవాయ నమః..
అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః..
అభయ స్వరూపాయ నమః
హరిహర పుత్రాయ నమః..
కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరీశిఖర
ఘన యోగ ముద్రాయనమః
పరమాణు హృదయాంతరాళ
స్థితానంత బ్రహ్మాండరూపాయనమః
అయ్యప్ప దేవాయ నమః...
అభయ స్వరూపాయ నమః
చరణం 1:
పద్దేనిమిది పదిమట్ల పైకెక్కి
గుడికేగు భక్తులకు
ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి
శుభమనుచు దీవించి
జనకృందములచేరే జనమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి
ఒకపక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే... శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయంబు కాగా
ధీమంతుడైలేచి ఆ కన్నేస్వామి
పట్టబంధము వీడి భక్తతటికై
పరుగు పరుగునవచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః...
అభయ స్వరూపాయ నమః
చరణం 2:
ఘోరకీకారణ్య సంసార యాత్రికుల
శరణుఘోషలు విని బ్రోచు శబరీష
పాపాలు దోషాలు ప్రక్షాలనము చేయు
పంపానదీ తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మట్లపై
నడిపించి కనిపించు అయ్యప్పస్వామి
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి
మహిమలను చూపించు మణికంఠస్వామి
కర్మ బంధము బాపు ధర్మశాస్త్ర..
కలి భీతి తొలిగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః...
అభయ స్వరూపాయ నమః
చరణం 3:
ఆద్యంత రహితమౌ.. నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము అణుచు.. శుభదీపం
ఈ నాల్గు దిక్కులు.. పదునాల్గు భువనాలు
పదిమెట్లుగా మారె... ఇదో అపురూపం
అరరులెల్లరు చెయు... అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి... నీదు సంకల్పం
పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం
అందుకో నక్షత్ర పుస్పాభిషేకం...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి