RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, నవంబర్ 2023, గురువారం

ఎవరు నీవు నీ రూపమేది | Evaru Neevu Nee Rupamedi | Song Lyrics | Premalu Pellillu (1974)

ఎవరు నీవు నీ రూపమేది 



చిత్రం :  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి:


ఎవరు నీవు నీ రూపమేది ..

ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ

ఎవరు నీవు నీ రూపమేది ..

ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ


నేనని వేరే లేనేలేనని...

నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ

మీకెలా తెలిపేదీ..


చరణం 1:


నిదుర పోయిన మనసును లేపి.. 

మనిషిని చేసిన మమతవు నీవో

నిదుర పోయిన మనసును లేపి.. 

మనిషిని చేసిన మమతవు నీవో

నిదురేరాని కనులను కమ్మని.. 

కలలతో నింపిన కరుణవు నీవో


పూజకు తెచ్చిన పూవును నేను ఊ... ఊ... ఊ...

పూజకు తెచ్చిన పూవును నేను.. 

సేవకు వచ్చిన చెలిమిని నేను

వసివాడే ఆ పసిపాపలకై..

వసివాడే ఆ పసిపాపలకై.. 

దేవుడు పంపిన దాసిని నేను


నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ.. 

మీకెలా తెలిపేదీ..

ఎవరు నీవు నీ రూపమేది ..

ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ


చరణం 2:


చేదుగ మారిన జీవితమందున.. 

తీపిన చూపిన తేనెవు నీవు..

చేదుగ మారిన జీవితమందున.. 

తీపిన చూపిన తేనెవు నీవు


వడగాడ్పులలో వడలిన తీగకు..

చిగురులు తొడిగిన చినుకే మీరు

చిగురులు తొడిగిన చినుకే మీరు...


కోరిక లేక కోవెలలోన.. 

వెలుగై కరిగే దీపం నీవు

దీపంలోని తాపం తెలిసి..

దీపంలోని తాపం తెలిసి.. 

ధన్యను చేసే దైవం మీరు

దైవం మీరు..

అహా హా అహా హా.. ఓహోహో ఓహోహో..

ఊహూహూ ఊహూహూ..


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు