RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

26, నవంబర్ 2023, ఆదివారం

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును | Sirulanosagi Siridi Sai katha | Song Lyrics | Devullu (2000)

షిరిడీ సాయి కథ



చిత్రం: దేవుళ్ళు (2000)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

గీతరచయిత: జొన్నవొత్తుల

నేపధ్య గానం: సుజాత, స్వర్ణలత



పల్లవి:


సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. 

షిరిడీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ.. 

సాయి ప్రేమ సుధ

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. 

షిరిడీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ.. 

సాయి ప్రేమ సుధ

పారాయణతో సకల జనులకి.. 

భారాలను తొలగించే గాధ

పారాయణతో సకల జనులకి.. 

భారాలను తొలగించే గాధ


సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. 

షిరిడీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ.. 

సాయి ప్రేమ సుధ


చరణం 1:


షిరిడీ గ్రామంలో.. ఒక బాలుని రూపంలో..

వేపచెట్టు క్రింద.. వేదాంతిగ కనిపించాడు

తన వెలుగును ప్రసరించాడు


పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం

పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం

ఆనందమే ఆహారం.. చేదు చెట్టునీడయే.. 

గురుపీఠం


ఎండకు వానకు కృంగకు.. 

ఈ చెట్టు క్రిందనే ఉండకు

సాయీ..ఈ.. సాయి రా.. మశీదుకు..

అని మహల్సాపతి పిలుపుకు

మసీదుకు మారెను సాయి

అదే అయినది ద్వారకమాయి

అక్కడ అందరు భాయీ భాయీ

బాబా బోధల నిలయమదోయి


సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. 

షిరిడీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ.. 

సాయి ప్రేమ సుధ


చరణం 2:


ఖురాను.. బైబిలు.. గీత.. ఒకటని

కులమత భేదము.. వద్దనే

గాలి వాననొక క్షణమున ఆపే

ఉడికే అన్నము చేతితో కలిపే


రాతి గుండెలను గుడులను చేసే

నీటి దీపములను వెలిగించే

పచ్చికుండలో నీటిని తెచ్చి.. 

పూలమొక్కలకు పోసి

దిండీ వనమును పెంచి.. 

మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే

కప్పకు పాముకు స్నేహం కలిపే.. 

తల్లి భాషకు అర్ధం తెలిపే


ఆర్తుల రోగాలను హరియించే

భక్తుల బాధలు తాను భరించే

ప్రేమ సహనం రెండు వైపుల ఉన్న 

నాణమును దక్షిణ అడిగే

మరణం జీవికి మార్పును తెలిపే

మరణించి తను మరలా బ్రతికే

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం


చరణం 3:


నీదని నాదని అనుకోవద్దని

ధునిలో ఊది విభూదిగనిచ్చే

భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు...

చావడి ఉత్సవమై సాగగా


కక్కడ హారతులందుకొని.. 

కలిపాపాలను కడుగగా

సకల దేవతా స్వరూపుడై.. 

వేదశాస్త్రములకతీతుడై

సద్గురువై.. జగద్గురువై

సత్యం చాటే దత్తాత్రేయుడై.. 

భక్తుని ప్రాణం రక్షించుటకై

జీవన సహచరి అని చాటిన తన 

ఇటుక రాయి తృటిలోన పగులగా

పరిపూర్ణుడై.. గురుపూర్ణిమై

భక్తుల మనసులో చిరంజీవియై.. 

శరీర సేవాలంగన చేసి

దేహము విడిచెను.. సాయి

సమాధి అయ్యెను.. సాయి


సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

అఖిలాండకోటి బ్రహ్మండ నాయక....

శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ మహరాజ్‌


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు