RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
swarnalatha songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
swarnalatha songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2026, శనివారం

ఏమిటి ఈ అవతారం | Emiti Ee Avatharam | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమిటి ఈ అవతారం 

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: కొసరాజు

నేపధ్య గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత


పల్లవి:


ఆ...ఏమిటే...

ఏమిటి ఈ అవతారం?

ఎందుకు ఈ సింగారం?

ఏమిటి ఈ అవతారం?

ఎందుకు ఈ సింగారం?

పాత రోజులు గుర్తొస్తున్నవి

ఉన్నది ఏదో వ్యవహారం

చాలును మీ పరిహాసం

ఈ సొగసంతా మీ కోసం


చరణం 1:


పౌడర్ దెచ్చెను నీకందం

బాగా వెయ్ వేలెడు మందం

పౌడర్ దెచ్చెను నీకందం

బాగా వెయ్ వేలెడు మందం

తట్టెడు పూలు తలను పెట్టుకుని

తయారైతివా చిట్టి వర్ధనం


చాలును మీ పరిహాసం

ఈ సొగసంతా మీ కోసం

చరణం 2:


ఆ...ఆ...ఓ...ఓ....

వయసులోన నే ముదురుదాననా

వయ్యారానికి తగనిదాననా

వయసులోన నే ముదురుదాననా

వయ్యారానికి తగనిదాననా

వరుసకాన్పులై వన్నె తగ్గినా

అందానికి నే తీసిపోదునా

ఏమిటి నా అపరాధం

ఎందుకు ఈ అవతారం


చరణం 3:


దేవకన్య ఇటు ఓహో...

దేవకన్య ఇటు దిగివచ్చిందని

భ్రమసి పోదునా కలనైనా

మహంకాళి నా పక్కనున్నదని

మరచిపోదునా ఎపుడైనా

చాలును మీ పరిహాసం

ఈ సొగసంతా మీ కోసం


నీళ్ళు కలపని పాలవంటిది

పిండి కలపని వెన్న వంటిది

నీళ్ళు కలపని పాలవంటిది

పిండి కలపని వెన్న వంటిది

నిఖారుసైనది నా మనసు

ఊరూవాడకు ఇది తెలుసు

ఏమిటి ఈ అవతారం?

చాలును మీ పరిహాసం

ఈ సొగసంతా మీ కోసం


- పాటల ధనుస్సు


22, మే 2026, శుక్రవారం

డివ్వి డివ్వి డివ్విట్టం | Divvi Divvi Divvittam | Song Lyrics | Dagudu Muthalu (1964)

డివ్వి డివ్వి డివ్విట్టం 


చిత్రం : దాగుడుమూతలు (1964)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం :  పిఠాపురం నాగేశ్వరరావు , స్వర్ణలత 


పల్లవి :


డివ్వి డివ్వి డివ్విట్టం... 

నువ్వంటేనే నాకిష్టం

డివ్వి డివ్వి డివ్విట్టం... 

నువ్వంటేనే నాకిష్టం


డీడిక్కంది అదృష్టం... 

గట్టెక్కింది మనకష్టం

డీడిక్కంది అదృష్టం... 

గట్టెక్కింది మనకష్టం


బాజాలతో బాకాలతో...  

పందిట్లో ఇద్దరం ఒకటౌదాం

బాజాలతో బాకాలతో...  

పందిట్లో ఇద్దరం ఒకటౌదాం... 


డివ్వి డివ్వి డివ్విట్టం... 

నువ్వంటేనే నాకిష్టం

డీడిక్కంది అదృష్టం... 

గట్టెక్కింది మనకష్టం


చరణం 1 :


అందరు చుట్టాలు వస్తారు... 

ఆనందమానందమంటారు

అందరు చుట్టాలు వస్తారు... 

ఆనందమానందమంటారు


అబ్బాయి తొందర చూస్తారు... 

తాము అటుతిరిగి పకపకా నవ్వేరు

అబ్బాయి తొందర చూస్తారు... 

తాము అటుతిరిగి పకపకా నవ్వేరు


ఒహో..డివ్వి డివ్వి డివ్విట్టం... 

నువ్వంటేనే నాకిష్టం

డీడిక్కంది అదృష్టం... 

గట్టెక్కింది మనకష్టం


చరణం 2 :


కవ్వించి సిరులన్ని కలిసొచ్చినా... 

కాబోవు పెళ్ళామే కడు పచ్చన

కొండకు వేశాను ఒక నిచ్చెనా... 

నీ కొంగు తగిలితే ఒళ్ళు నులివెచ్చనా


డీడిక్కంది అదృష్టం... 

గట్టెక్కింది మనకష్టం

డివ్వి డివ్వి డివ్విట్టం... 

నువ్వంటేనే నాకిష్టం


చరణం 3  :


బుక్కావసంతాలు జల్లుకొంటాం... 

ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం

బుక్కావసంతాలు జల్లుకొంటాం... 

ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం


దీవించివేస్తారు అక్షంతలూ... 

ఇక అవుతాయి సౌఖ్యాల లక్షంతలూ

దీవించివేస్తారు అక్షంతలూ... 

ఇక అవుతాయి సౌఖ్యాల లక్షంతలూ


డివ్వి డివ్వి డివ్విట్టం... 

నువ్వంటేనే నాకిష్టం

డీడిక్కంది అదృష్టం... 

గట్టెక్కింది మనకష్టం


- పాటల ధనుస్సు 


21, ఆగస్టు 2024, బుధవారం

పిల్ల అదరహో పిచ్చి ముదర హో | Pilla Adaraho Pichi Mudaraho | Song Lyrics | Amma Donga (1995)

పిల్ల అదరహో పిచ్చి ముదర హో



చిత్రం - అమ్మ దొంగా (1995 )

సాహిత్యం - వేటూరి  

సంగీతం - కోటి,

గానం  : మనో, స్వర్ణలత జూనియర్ 


పల్లవి: 


పిల్ల అదరహో... పిచ్చి ముదర హో...

అరె పిల్ల అదరహో పిచ్చి ముదర హో

అబ్బ దీని సోకు మాడ ఉబ్బలూరు

నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి

మురిపాలే పొంగిస్తాది 

సగ పాలే అందిస్తాది


కన్నె కజరహో... కన్ను చదర హో...

హా కన్నె కజరహో కన్ను చదర హో

అమ్మ దొంగ చల్లకొచ్చి ముంతదోచి

బుజ్జగించి బుగ్గ పండు గాటు పెట్టి

మరుమల్లె చెండిస్తాడు 

మగడల్లే చెయ్యెస్తాడు


అరె పిల్ల అదరహో...

హా కన్ను చదర హో...


చరణం 1 :


ఆహా...

నచ్చిందే మెచ్చానే మెచ్చిందంతా గిచ్చానే

అచ్చాగ ఉన్నావే బచ్చా బంతి మొగమ్మ

వచ్చిందే వయ్యారం వాటేస్తావ ఈ వారం

హా చేస్తావా సంసారం చేమంతుల్లో పై వారం

ఎగుడు దిగుడు సొగసు

అది మొగుడు అడుగు వయసు

తళుకు బెళుకు తడిమే

తాలాంగుది తాళం ఇవాళ


కన్నె కజరహో... కన్ను చదర హో...

అరెరరె అబ్బదీని సోకుమాడ

ఉబ్బలూరు నిబ్బరాల 

డబ్బపండు కాపుకొచ్చి

మరుమల్లె చెండిస్తాడు 

మగడల్లే గిల్లేస్తాడు


చరణం 2 :


హా హొ హా హా...

గుత్తంగా గుచ్చెక్కి గుంతల్ బంజాయిస్తాలే

మెత్తంగా మత్తెట్టి మెహదీ పట్నం వస్తాలే

కళ్ళల్లో నీ రోషం అబ్బ కవ్వించింది ఈ మాసం

అరె తీస్తాలే నీకు సౌండ్ తీరుస్తావా ఉల్లాసం


గుబులు మనసు కబురు

అది మొగలి పొదల గుబురు

నలక నడుము వనికె

సుఖాలలో తుఫానివాలే...


పిల్ల అదరహో... పిచ్చి ముదర హో...

హా కన్నె కజరహో... కన్ను చదర హో...

అబ్బ దీని సోకు మాడ ఉబ్బలూరు

నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి

మరుమల్లె చెండిస్తాడు 

మగడల్లే చెయ్యెస్తాడు


- పాటల ధనుస్సు  


26, నవంబర్ 2023, ఆదివారం

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును | Sirulanosagi Siridi Sai katha | Song Lyrics | Devullu (2000)

షిరిడీ సాయి కథ



చిత్రం: దేవుళ్ళు (2000)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

గీతరచయిత: జొన్నవొత్తుల

నేపధ్య గానం: సుజాత, స్వర్ణలత



పల్లవి:


సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. 

షిరిడీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ.. 

సాయి ప్రేమ సుధ

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. 

షిరిడీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ.. 

సాయి ప్రేమ సుధ

పారాయణతో సకల జనులకి.. 

భారాలను తొలగించే గాధ

పారాయణతో సకల జనులకి.. 

భారాలను తొలగించే గాధ


సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. 

షిరిడీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ.. 

సాయి ప్రేమ సుధ


చరణం 1:


షిరిడీ గ్రామంలో.. ఒక బాలుని రూపంలో..

వేపచెట్టు క్రింద.. వేదాంతిగ కనిపించాడు

తన వెలుగును ప్రసరించాడు


పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం

పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం

ఆనందమే ఆహారం.. చేదు చెట్టునీడయే.. 

గురుపీఠం


ఎండకు వానకు కృంగకు.. 

ఈ చెట్టు క్రిందనే ఉండకు

సాయీ..ఈ.. సాయి రా.. మశీదుకు..

అని మహల్సాపతి పిలుపుకు

మసీదుకు మారెను సాయి

అదే అయినది ద్వారకమాయి

అక్కడ అందరు భాయీ భాయీ

బాబా బోధల నిలయమదోయి


సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. 

షిరిడీ సాయి కథ

మధుర మధుర మహిమాన్విత బోధ.. 

సాయి ప్రేమ సుధ


చరణం 2:


ఖురాను.. బైబిలు.. గీత.. ఒకటని

కులమత భేదము.. వద్దనే

గాలి వాననొక క్షణమున ఆపే

ఉడికే అన్నము చేతితో కలిపే


రాతి గుండెలను గుడులను చేసే

నీటి దీపములను వెలిగించే

పచ్చికుండలో నీటిని తెచ్చి.. 

పూలమొక్కలకు పోసి

దిండీ వనమును పెంచి.. 

మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే

కప్పకు పాముకు స్నేహం కలిపే.. 

తల్లి భాషకు అర్ధం తెలిపే


ఆర్తుల రోగాలను హరియించే

భక్తుల బాధలు తాను భరించే

ప్రేమ సహనం రెండు వైపుల ఉన్న 

నాణమును దక్షిణ అడిగే

మరణం జీవికి మార్పును తెలిపే

మరణించి తను మరలా బ్రతికే

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం


చరణం 3:


నీదని నాదని అనుకోవద్దని

ధునిలో ఊది విభూదిగనిచ్చే

భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు...

చావడి ఉత్సవమై సాగగా


కక్కడ హారతులందుకొని.. 

కలిపాపాలను కడుగగా

సకల దేవతా స్వరూపుడై.. 

వేదశాస్త్రములకతీతుడై

సద్గురువై.. జగద్గురువై

సత్యం చాటే దత్తాత్రేయుడై.. 

భక్తుని ప్రాణం రక్షించుటకై

జీవన సహచరి అని చాటిన తన 

ఇటుక రాయి తృటిలోన పగులగా

పరిపూర్ణుడై.. గురుపూర్ణిమై

భక్తుల మనసులో చిరంజీవియై.. 

శరీర సేవాలంగన చేసి

దేహము విడిచెను.. సాయి

సమాధి అయ్యెను.. సాయి


సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

అఖిలాండకోటి బ్రహ్మండ నాయక....

శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ మహరాజ్‌


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు