RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kurisindi vaana naa gundelona లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kurisindi vaana naa gundelona లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, నవంబర్ 2023, శుక్రవారం

కురిసింది వానా నా గుండెలోనా | Kurisindi Vaana Naa Gunde lona | Song Lyrics | Bullemma Bullodu (1972)

కురిసింది వానా.. నా గుండెలోనా.. 



చిత్రం :  బుల్లెమ్మ బుల్లోడు (1972)

సంగీతం :  సత్యం

గీతరచయిత : రాజశ్రీ

నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి:


కురిసింది వానా.. నా గుండెలోనా.. 

నీ చూపులే జల్లుగా..

కురిసింది వానా.. నా గుండెలోనా.. 

నీ చూపులే జల్లుగా..

ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు..

కురిసింది వానా.. నా గుండెలోనా.. 

నీ చూపులే జల్లుగా..


చరణం 1:


అల్లరి చేసే.. ఆశలు నాలో.. 

పల్లవి పాడేనూ..ఊ..ఊ..

తొలకరి వయసు.. గడసరి మనసు.. 

నీ జత కోరేనూ..ఊ..ఊ..

అల్లరి చేసే.. ఆశలు నాలో.. పల్లవి పాడేను..

చలి గాలి వీచే.. గిలిగింత తోచే..


కురిసింది వానా.. నా గుండెలోనా.. 

నీ చూపులే జల్లుగా..


చరణం 2:


ఉరకలు వేసే.. ఊహలు నాలో.. 

గుసగుస లాడేనూ..ఊ..ఊ..

కథలను తెలిపే.. కాటుక కనులు.. 

కైపులు రేపేనూ..ఊ..ఊ..

ఉరకలు వేసే.. ఊహలు నాలో.. 

గుసగుస లాడేను..

బిగువు ఇంకేలా.. దరికి రావేలా..


కురిసింది వానా.. నా గుండెలోనా.. 

నీ చూపులే జల్లుగా..


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు