RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
rojaramani songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rojaramani songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2024, మంగళవారం

రాధా అందించు నీ లేత పెదవి | Radha Andinchu nee letha pedavi | Song Lyrics | Jebu Donga (1975)

రాధా అందించు నీ లేత పెదవి



చిత్రం: జేబు దొంగ (1975) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: ఆరుద్ర 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


రాధా.. అందించు నీ లేత పెదవి

ఏహే..లాలించు తీరాలి తనివి 


గోపీ నాలోని అందాలు నీవి 

ఓహో.. నీ రాగ బంధాలు నావి 


సరే..పదా..ఇటూ.. 

మనసు పొంగినది..మధువులూరినవి.. 

మమత గుండెలో.. నిండి పోయినవి 


రాధా.. అందించు నీ లేత పెదవి 

గోపీ.. నాలోని అందాలు నీవి 


చరణం 1: 


చెంపల్లోనా కెంపులున్నవి..

ఒంపుల్లోనా వలపులున్నవి 

ఇంపు సొంపు మధుర మధురమాయే 

చెంపల్లోనా కెంపులున్నవి..

ఒంపుల్లోనా వలపులున్నవి 

ఇంపు సొంపు మధుర మధురమాయే 


నీ పేరే తియ్యనైనది..

నీ రూపే కమ్మనైనది 

నీ మనసే చల్లనైనది..

నీ తోడే వెచ్చనైనది 


హే...సొగసు ఉయ్యాలలూగిందీ 

ఓ ఓ.. వయసు వయ్యార మొలికిందీ 


రాధా..నాలోని అందాలు నీవి 

గోపీ..అందించు నీ లేత పెదవి 


చరణం 2: 


మేను మేను వీణలైనవి..

మెల్లగ చేతులు మీటుతున్నవి 

ఏదో గానం మోగుతున్నదోయి 

మేను మేను వీణలైనవి..

మెల్లగ చేతులు మీటుతున్నవి 

ఏదో గానం మోగుతున్నదోయి 


చెలరేగే చిలిపి ఊహలు..

పులకించే పడుచు గుండెలు 

చిగురించే కొత్త ఆశలు..

పెనవేసే రెండు తనువులు 


ఓ ఓ..వలపు కెరటాల మునగాలి 

ఆహా..మధుర ప్రణయాల తేలాలి 


రాధా.. అందించు నీ లేత పెదవి 

గోపీ.. నాలోని అందాలు నీవి 

సరే..పదా..ఇటు.. 

మనసు పొంగినది..

మధువులూరినవి 

మమత గుండెలో..

నిండి పోయినది 


రాధా..నాలోని అందాలు నీవి 

గోపీ..అందించు నీ లేత పెదవి 


రాధా...గోపీ...


- పాటల ధనుస్సు 


13, జులై 2024, శనివారం

మల్లె కన్న తెల్లన వెన్నెలంత చల్లన | Mallekanna Tellana | Song Lyrics | O Seetha Katha (1974)

మల్లె కన్న తెల్లన వెన్నెలంత చల్లన 



చిత్రం : ఓ సీత కథ (1974)

రచన : సి నారాయణ రెడ్డి,

సంగీతం : K V మహదేవన్, 

గానం : SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల,


పల్లవి:


మల్లె కన్న తెల్లన....

వెన్నెలంత చల్లన...

ఏది... ఏది.. ఏది..

మల్లె కన్న తెల్లన మా సీత సొగసు..

వెన్నెలంత చల్లన మా సీత సొగసు...


తేనె కన్న తీయన...

పెరుగంత కమ్మన...

ఏది... ఏది.. ఏది..

తేనె కన్న తీయన మా బావ మనసు..

పెరుగంత కమ్మన మా బావ మనసు...


చరణం 1:


నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి...

నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి...

... ఏమని

కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని..

కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని...

నీతోనే ఒక మాట ...నీతోనే ఒక మాట...

చెప్పాలి.... ఏమని

నీ తోడే లేకుంటే ఈ సీతే లేదని...


మల్లె కన్న తెల్లన మా సీత సొగసు..

తేనె కన్న తీయన మా బావ మనసు..


చరణం 2:


మనసుంది ఎందుకని... 

మమతకు గుడిగా మారాలని..

వలపుంది ఎందుకని ...

ఆ గుడిలో దివ్వెగా నిలవాలని..

మనసుంది ఎందుకని... 

మమతకు గుడిగా మారాలని..

వలపుంది ఎందుకని ...

ఆ గుడిలో దివ్వెగా నిలవాలని..


మనువుంది ఎందుకని.. 

ఆ దివ్వెకు వెలుగై పోవాలని

బ్రతుకుంది ఎందుకని... 

ఆ వెలుగే నీవుగా చూడాలని...

ఆ వెలుగే నీవుగా చూడాలని


మల్లె కన్న తెల్లన...ఊహు..ఊ...

తేనె కన్న తీయన...ఊ..ఊ..ఊ...


- పాటల ధనుస్సు  


13, నవంబర్ 2023, సోమవారం

ఏమనీ వర్ణంచనూ | Emani Varninchanu | Song Lyrics | Driver Ramudu (1978)

ఏమనీ వర్ణంచనూ



చిత్రం: డ్రైవర్‌ రాముడు (1978)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి:


ఏమనీ వర్ణంచనూ..ఊ..ఊ

ఏమనీ వర్ణించనూ..ఊ..ఊ..

నీ కంటి వెలుగునూ..వెన్నంటి మనసునూ..

వెన్నెల నవ్వునూ..నీ ఇలవేల్పునూ..

ఏమనీ వర్ణించనూ..


ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆ..ఆ


చరణం 1:


పైర గాలిలాగా..చల్లగా వుంటాడూ...

తెల్లారి వెలుగులా..వెచ్చగా వుంటాడు..

పైర గాలిలాగా..చల్లగా వుంటాడూ

తెల్లారి వెలుగులా..వెచ్చగా వుంటాడు..

తీర్చిన బొమ్మలా తీరైన వాడు

తీర్చిన బొమ్మలా తీరైన వాడు

తీరని ఋణమేదో తీర్చుకో వచ్చాడు


ఏమనీ వర్ణంచనూ..ఆ..ఆ...


చరణం 2:


రాముడు కాడమ్మా..ఆ.. నిందలు నమ్మడు..

కృష్ణుడు కాడమ్మ.. సవతులు ఉండరు...


నీవు పూజించే దేవుళ్ళ లోపాలు లేని వాడు..ఊ..ఊ

నీ పూజ ఫలియించి నీ దేవుడయినాడు..

నీ పూజ ఫలియించి నీ దేవుడయినాడు..

ఏమనీ వర్ణించనూ..ఊ..ఊ


చరణం 3:


ఆఅ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ


కళ్ళు లేవనీ నీకు కలతింక వలదమ్మ...

తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా...

కళ్ళు లేవనీ నీకు కలతింక వలదమ్మ...

తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా...


ఆ దేవుడు ఎదురయితే..వేరేమి కోరను

ఆ దేవుడు ఎదురయితే..వేరేమి కోరను

నా అన్న రూపాన్ని చూపితే చాలును..


ఏమనీ ఊహించనూ..ఊ..

నా అన్న రూపును..నాకున్న వెలుగును..

వెన్నంటి మనసును.. నా ఇలవేల్పును..

ఏమనీ ఊహించనూ..ఊ..ఊ..ఊ


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు