RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

31, అక్టోబర్ 2023, మంగళవారం

ఈ రాధ చివరకు ఏమైనా | Ee Radha Chivariki Emaina | Song Lyrics | Edureetha (1977)

ఈ రాధ చివరకు ఏమైనా



చిత్రం :  ఎదురీత (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత : సినారె  

నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే 

ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే 

కలలన్నీ అలలైన యమునా నదిలో... 

కలతల కన్నీరే...


ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే 


చరణం : 1


బృందావనిలో బిగికౌగిలిలో... 

అల్లికలేమాయే... కలయికలేమాయే...

వ్రేపల్లియలో.. వేణువు ఎదలో.. 

గీతికలేమాయే... 

మధురాపురిలో.. నడిరాతిరిలో... 

మాధవుడేమాయే...


ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే 


చరణం : 2


మరుమల్లెలలో... విరిజల్లులలో.. 

మల్లికలేమాయే... మధురిమలేమాయే..  

ఆ కన్నులలో... వెన్నెల దాచిన 

పున్నమలేమాయే...

చేసిన బాసలు.. పూచిన ఆశలు.. 

రాలిన పూలాయే...


ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే


పాటల ధనుస్సు 

తపము ఫలించిన శుభవేళా | Tapamu Falinchina Shubhavela | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

తపము ఫలించిన శుభవేళా



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 



పల్లవి :


తపము ఫలించిన శుభవేళా.. 

బెదరగనేలా ప్రియురాలా

తపము ఫలించిన శుభవేళా.. 

బెదరగనేలా ప్రియురాలా

ఎదుట నిలువుమని మంత్రము వేసి 

చెదరగనేలా జవరాలా 

తపము ఫలించిన శుభవేళా 

బెదరగనేలా ప్రియురాలా


చరణం 1 :


తెలిమబ్బులలో జాబిలి వలెనే 

మేలిముసుగులో దాగెదవేలా

తెలిమబ్బులలో జాబిలి వలెనే 

మేలిముసుగులో దాగెదవేలా

వలచి వరించి.. మనసు హరించి.. 

నను దికురించగనేలా


తపము ఫలించిన శుభవేళా 

బెదరగనేలా ప్రియురాలా 


చరణం 2 :


చూపులతోనే పలుకరించుచూ.. 

చాటున వలపులు చిలకరించుచూ

చూపులతోనే పలుకరించుచూ.. 

చాటున వలపులు చిలకరించుచూ

కోరిక తీరే తరుణము రాగా 

తీరా ఇపుడీ జాగేలా


తపము ఫలించిన శుభవేళా.. 

బెదరగనేలా ప్రియురాలా


పాటల ధనుస్సు 


29, అక్టోబర్ 2023, ఆదివారం

నీకై వేచితినయ్యా | Neekai Vechitinayya | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

నీకై వేచితినయ్యా



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


నీకై వేచితినయ్యా... 

ఓ.. ఏకాంత రామయ్యా... ఆ..

నీకై కాచితినయ్యా...ఆ...ఆ..


నీకై వేచితినయ్యా... 

ఓ ఏకాంత రామయ్యా... ఆ..

నీకై కాచితినయ్యా...ఆ...ఆ..

నీకై కాచితినయ్యా... 



చరణం 1 :


నీవీ క్షణమున వచ్చెదవోయని... 

ఎదురులు చూచితినయ్యా..ఆ..

ఎదురులు చూచితినయ్యా....


నీవు నడతువని త్రోవ త్రోవల... 

పూవుల పరచితినయ్యా...


నీకై వేచితినయ్యా... 

ఓ ఏకాంత రామయ్యా..

నీకై కాచితినయ్యా...



చరణం 2 :


చిగురాకులలో గాలి కదిలినా.. 

నీవని భ్రమచితినయ్యా..ఆ...

నీవని భ్రమచితినయ్యా..

చిలుక పలికినా.. నీ పిలుపేయని... 

ఉలుకున కలగితినయ్యా...ఆ...


నీకై వేచితినయ్యా... 

ఓ ఏకాంత రామయ్యా..

నీకై కాచితినయ్యా...



చరణం 3 : 


నీకు ప్రియముగా విరిసిన పూవుల 

మాలికలల్లితినయ్యా..ఆ..

మాలికలల్లితినయ్యా...

మనసున నిలిచిన మంగళ రూపము.. 

ఎన్నడు చూచెదనయ్యా...ఆ..


నీకై వేచితినయ్యా... 

ఓ ఏకాంత రామయ్యా..ఆ

నీకై కాచితినయ్యా...ఆ...ఆ..

నీకై కాచితినయ్యా...


పాటల ధనుస్సు 


మనసు పరిమళించెనే | Manasu Parimalinchene | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

మనసు పరిమళించెనే



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 



పల్లవి :

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 

మనసు పరిమళించెనే..  

తనువు పరవశించెనే

నవ వసంత గానముతో.. 

నీవు నటన సేయగనే


మనసు పరిమళించెనే..  

తనువు పరవశించెనే

నవ వసంత రాగముతో.. 

నీవు చెంత నిలువగనే 

మనసు పరిమళించెనే.. 

తనువు పరవశించెనే


చరణం 1 :


నీకు నాకు స్వాగతమనగా 

కోయిలమ్మ కూయగా

ఆ..... ఆ.... . ఆ..... ఆ....

నీకు నాకు స్వాగతమనగా 

కోయిలమ్మ కూయగా

గలగలగల సెలయేరులలో 

కలకలములు రేగగా 

మనసు పరిమళించెనే.. ఆ.. ఆ.. హా..

తనువు పరవశించెనే.. ఓ..ఓ..ఓ..

నవ వసంత గానముతో... 

నీవు చెంత నిలువగనే 


మనసు పరిమళించెనే... 

తనువు పరవశించెనే


చరణం 2 :


క్రొత్త పూల నెత్తావులతో 

మత్తుగాలి వీచగా

ఆహ .. ఆ . అ ఆ

క్రొత్త పూల నెత్తావులతో 

మత్తుగాలి వీచగా

భ్రమరమ్ములు గుములు గుములుగా...  

ఝుం ఝుమ్మని పాడగా 


మనసు పరిమళించెనే... 

తనువు పరవశించెనే


చరణం 3 : 


తెలి మబ్బులు కొండ కొనలపై 

హంసల వలె ఆడగా

అహా .. ఆ . అ.. ఆ

తెలి మబ్బులు కొండ కొనలపై 

హంసల వలె ఆడగా

రంగరంగ వైభవములతో 

ప్రకృతి విందు సేయగా


మనసు పరిమళించెనే...  

తనువు పరవశించెనే

నవ వసంత రాగముతో 

నీవు చెంత నిలువగనే

మనసు పరిమళించెనే... 

తనువు పరవశించెనే


పాటల ధనుస్సు 


27, అక్టోబర్ 2023, శుక్రవారం

అదివో అల్లదివో శ్రీహరి వాసము | Adivo Alladivo Srihari Vasamu | Song Lyrics | Kaliyuga Daivam (1983)

అదివో అల్లదివో శ్రీహరి వాసము



చిత్రం : కలియుగ దైవం (1983)

సంగీతం : సత్యం 

రచన : అన్నమాచార్య 

గానం : P సుశీల 



పల్లవి :


అదివో అల్లదివో శ్రీహరి వాసము

అదివో అల్లదివో శ్రీహరి వాసము

పది వేలు శేషుల పడగల మయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము

పది వేలు శేషుల పడగల మయము

అదివో...


చరణం 1 :


అదె వేంకటాచల మఖిలోన్నతము

అదివో బ్రహ్మాదుల కపురూపము

అదె వేంకటాచల మఖిలోన్నతము

అదివో బ్రహ్మాదుల కపురూపము


అదివో నిత్యనివాస మఖిలమునులకూ

అదె చూడుడూ అదె మ్రొక్కుడూ.. 

ఆనందమయము...


అదివో అల్లదివో శ్రీహరి వాసము


భువనమోహన కౌసల్య ముద్దుబిడ్డ 

తూరుపు తెల్లవారుతున్నదో తోయజాక్షి 

దేవకార్యములన్నియు దీర్ప వలయు 

తొందరగా నిద్ర మేలుకో సుందరాంగా


చరణం 2 :


చెంగట నల్లదివో శేషాచలము

నింగి నున్నదేవతల నిజవాసము

చెంగట నల్లదివో శేషాచలము

నింగి నున్నదేవతల నిజవాసము


ముంగిట నల్లదివో మూలనున్నధనము

బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము


అదివో అల్లదివో శ్రీహరి వాసము


శ్రీగిరియు వృషభాద్రియు శేషశైలమనియు 

నారాయణాద్రియు నట వృషాద్రి పేర్మి 

గరుడాచలమ్మని వేంకటాద్రి పేర

నీ ఏడుకొండలను పిలుచుచుందురు 


మేలుకో సప్తగిరివాస 

మేలుకో ... మేలుకో ...


చరణం 3 :


కైవల్య పదము వేంకటనగ మదివో

శ్రీ వేంకటపతికి సిరులైనది

కైవల్య పదము వేంకటనగ మదివో

శ్రీ వేంకటపతికి సిరులైనది  

పావనములకెల్ల పావన మయము


అదివో అల్లదివో శ్రీహరి వాసము

శ్రీ హరివాసమూ శ్రీహరివాసమూ 

శ్రీహరివాసమూ


పాటల ధనుస్సు 


స్వాముల సేవకు వేళాయె | Swamula Sevaku Velaye | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

స్వాముల సేవకు వేళాయె



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  సుశీల

 


పల్లవి :


స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా

స్వాముల సేవకు వేళాయె.. 

వైళమె రారే చెలులారా

ఆశీర్వాదము లభించుగా... 

చేసే పూజలు ఫలించుగా..

స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా 


చరణం 1 :


ఎన్ని తీర్థములు సేవించారో... 

ఎన్ని మహిమలను గణియించారో

విజయం చేసిరి మహానుభావులు... 

మన జీవితములు తరించుగా

స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా 



చరణం 2 :


లీలాశుకులో.. ఋష్యశృంగులో... 

మన యతీంద్రులై వెలసిరిగా

ఏమి పూజలో.. ఏమి ధ్యానమో.. 

మన లోకములో ఉండరుగా

స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా



చరణం 3 :


ఏయే వేళలకేమి ప్రియములో... 

ఆ వేళలకవి జరుపవలె

సవ్వడి చేయక... సందడి చేయక... 

భయభక్తులతో మెలగవలె

స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా


పాటల ధనుస్సు 


26, అక్టోబర్ 2023, గురువారం

ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు | Idigo Tella cheera | Song Lyrics | Ooruki Monagadu (1981)

ఇదిగో తెల్ల చీరా.. ఇవిగో  మల్లె పూలు 



చిత్రం: ఊరికి మొనగాడు (1981) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, సుశీల 



పల్లవి: 


ఇదిగో తెల్ల చీరా.. ఇవిగో  మల్లె పూలు 

ఇదిగో తెల్ల చీర... ఇవిగో  మల్లె పూలు 

తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో 

తెల్లార్లు నా పేరు వల్లించుకో...ఎందుకు.. 


ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి.. 


ఇదిగో తెల్ల చీరా... ఇవిగో  మల్లె పూలు 

ఇదిగో తెల్ల చీర... ఇవిగో  మల్లె పూలు 

తెల్ల చీర కట్టినా... మల్లె పూలు పెట్టినా.. 

తెల్లార్లు నీ పేరు వల్లించుతా...ఎందుకు.. 

ఇదే అసలు రాత్రి.... ఇదే అసలు రాత్రి 


చరణం 1: 


కాకి చేత పంపిస్తే కబురందిందా... 

కళ్ళారా చూడగానే కథ తెలిసిందా... 

కాకి చేత పంపిస్తే కబురందిందా ...

కళ్ళారా చూడగానే కథ తెలిసిందా 


ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు... 

ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ 

ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు... 

ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ... 


ఆలు లేదు.. చూలు లేదు... 

కొడుకు పేరు సోమలింగం 

ఆదిలోనే బారసాల... 

చేసుకోవా సీమంతం..

ఓలొ..లో..లో..హాయ్...

ఓలొ..లో..లో..హాయ్... 



ఇదిగో తెల్ల చీర..ఆఆ.. 

ఇవిగో మల్లె పూలు.. ఊఊఊ 

ఇదిగో తెల్ల చీర... ఇవిగో  మల్లె పూలు 


తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో 

తెల్లార్లు నా పేరు వల్లించుకో...ఎందుకు.. 


ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి.. 


చరణం 2: 


సూది కోసం సోదికెళితే సుడి తిరిగిందా.. 

మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా.. 

సూది కోసం సోదికెలితే సుడి తిరిగిందా ... 

మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా .. 


కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా... 

పొద్దైనా అయ్యో నువ్వే ఊపాలా.. 

నేనే జోల పాడుతుంటే... 

నువ్వు నిద్దర పోతావా 

అయ్యా మీరు పక్కనుంటే 

అసలే నిద్దర పడుతుందా.. 

ఉలులు..లుల..హాయ్... 

ఆఁ...ఉలులు..లుల..హాయ్...ఆఁ... 


ఇదిగో తెల్ల చీర ఆ..ఇవిగో మల్లె పూలు అహా... 

ఇదిగో తెల్ల చీర.. ఇవిగో  మల్లె పూలు... 

తెల్ల చీర కట్టినా... మల్లె పూలు పెట్టినా.. 

తెల్లార్లు నీ పేరు వల్లించుతా...ఎందుకు.. 

ఇదే అసలు రాత్రి.... ఇదే అసలు రాత్రి...


పాటల ధనుస్సు 

24, అక్టోబర్ 2023, మంగళవారం

ఈ గాలిలో ఎక్కడో అలికిడి | Ee Galilo Ekkado Alikidi | Song Lyrics | Agni Parvatham (1985)

ఈ గాలిలో ఎక్కడో అలికిడి అక్కడే అలజడి



చిత్రం : అగ్ని పర్వతం (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి :


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ

ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..

ఎక్కడో అలికిడి...హా… 

అక్కడే అలజడి..మ్మ..హా..

మత్తుగా తడబడి...  

మెత్తగా జతబడి

పెట్టెను కౌగిలి ఒక వంకా...  

పెట్టెను చెక్కిలి నెలవంక

ఏమౌతదో ఏమిటో...ఓ... ఓ...


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ…

ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..

ఎక్కడో అలికిడి 

అక్కడే అలజడి

మత్తుగా తడబడి... 

మెత్తగా జతబడి

చెక్కిలిగుంటలు ఒకవంకా... 

చక్కిలిగింతలు ఒక వంక

ఈ కాస్తకే ఎందుకో.....


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...


చరణం 1 :


 నవ్విన వేళ మధుమాసంలా 

విరబూసే నా కోర్కేలే…

పువ్వూ నేను పుట్టిన నాడే 

వాలాము నీ పక్కనే…

వేసవి వడిలో వెన్నెల తడిలా

తనువులు కలిపే పెదవుల పొడిలో

ఈ ప్రేమ పందిళ్ళలో...ఓ..ఓ..


ఈ గాలిలో..ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ

ఈ గాలిలో...ఓ...ఓ...ఓ

ఎక్కడో అలికిడి.. హా.. హా..

అక్కడే అలజడి..హా..హా..

మత్తుగా తడబడి మెత్తగా జతబడి

పెట్టెను కౌగిలి ఒక వంక..హా..

పెట్టెను చెక్కిలి నెలవంక

ఈ కాస్తకే.. ఎందుకో..ఓ...ఓ..


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ

లలలల లలలల..లలలల లలలల..

లల లలలా లలల..


చరణం 2 :


తాకిన చోటా తాంబూలంలా 

ఎరుపెక్కె నీ చెక్కిలీ

పొద్దూ ముద్దూ పుట్టే చోట...  

ఎరుపెక్కవా ఆ దిక్కులే..

ఎద చలి పెరిగీ ఎదరకు జరిగే

కథ ఇక మొదలై కౌగిట బిగిసే

ఈ సందె సయ్యాటలో..ఓ..ఓ..


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ

ఈ గాలిలో..ఓ..ఓ..ఓ..ఓ

ఎక్కడో అలికిడి..హా..హా..

అక్కడే అలజడి..హా..హా..

మత్తుగా తడబడి 

మెత్తగా జతబడి

పట్టెను కౌగిలి ఒక వంక..

పెట్టెను చెక్కిలి నెలవంక

ఈ కాస్తకే ఎందుకో..ఓ...ఓ..ఓ..


- పాటల ధనుస్సు 





23, అక్టోబర్ 2023, సోమవారం

చుట్టూ చెంగావి చీర | Chuttu chengavi Cheera | Song Lyrics | Toorpu Velle Railu (1979)

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ



చిత్రం  : తూర్పు వెళ్లే రైలు (1979)

సంగీతం : S.P. బాలసుబ్రమణ్యం 

రచన  : ఆరుద్ర 

గానం  :S.P. బాలసుబ్రమణ్యం 


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి

ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ


తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా

నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా

ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా 

 పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ 


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ 


నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు

ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు

వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు

వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లూ


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ 

బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి

ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ


పాటల ధనుస్సు 


20, అక్టోబర్ 2023, శుక్రవారం

పాపి కొండల వెనుక పాపంటి మనసున్న | Papikondala venuka | Song Lyrics | Adavallu Meeku Joharlu (1981)

పాపి కొండల వెనుక పాపంటి మనసున్న



చిత్రం: ఆడాళ్ళు మీకు జోహార్లు (1981) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపథ్య గానం: సుశీల 


పల్లవి : 



పాపికొండల వెనుక.. 

పాపంటి మనసున్న 

జాబిల్లీ ఉన్నాడనీ.. 

చల్లని కబురొచ్చెనే... 

నా జంకంతా విడిపోయేనే 


పాపి కొండల వెనుక పాపంటి మనసున్న 

జాబిల్లీ ఉన్నాడననీ.. 

చల్లని కబురొచ్చెనే.. 

నా జంకంతా విడిపోయెనే 



చరణం 1: 


చీకటి కడుపులో పుట్టాడనీ.. 

వెలుగొచ్చి చీకటినే  చంపాడనీ.. 

చీకటి కడుపులో పుట్టాడనీ... 

వెలుగొచ్చి చీకటినే  చంపాడనీ... 


మాయని మచ్చొకటి కలవాడని 

మగువుల పాలిటి పగవాడని 

మాయని మచ్చొకటి కలవాడని 

మగువుల పాలిటి పగవాడని

నిలకడే లేదని నిందలే వింటినీ.... 

విన్నది కల్లాయనే... 

తెలి వెన్నెల జల్లాయనే... 


పాపికొండల వెనుక.. 

పాపంటి మనసున్న 

జాబిల్లి ఉన్నాడనీ... 

చల్లని కబురొచ్చెనే... 

నా జంకంతా విడిపోయెనే 



చరణం 2 : 


గోదారి గోలనే వింటారు... 

గుండెలో చలవెవరు చూస్తారు... 

గోదారి గోలనే వింటారూ... 

గుండెలో చలవెవరు చూస్తారు... 


కోకిలకు కాకికి గూడొక్కటే

తేడాలు తెలిపేది గొంతొక్కటే 

కోకిలకి కాకికి గూడొక్కటే 

తేడాలు తెలిపేది గొంతొక్కటే 

నమ్మితే దేవుడు రాతిలో ఉన్నాడు 

కాకుల లోకానికి... 

నువ్వు కోకిల కావాలిలే... 


పాపికొండల వెనుక.. 

పాపంటి మనసున్న 

జాబిల్లి ఉన్నాడనీ.. ఈ ఈ ఈ.... 

చల్లని కబురొచ్చెనే... 

నా జంకంతా విడిపోయెనే 

చల్లని కబురొచ్చెనే... 

నా జంకంతా విడిపోయెనే..


పాటల ధనుస్సు 


15, అక్టోబర్ 2023, ఆదివారం

మహాకనకదుర్గా విజయకనకదుర్గా | Maha Kanaka Durga | Song Lyrics | Devullu (2000)

మహాకనకదుర్గా విజయకనకదుర్గా



చిత్రం: దేవుళ్ళు (2000)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

గీతరచయిత: జొన్నవిత్తుల

నేపధ్య గానం: జానకి


పల్లవి:


మహాకనకదుర్గా విజయకనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరిత

మహాకనకదుర్గా విజయకనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరిత


శివంకరి శుభంకరి 

పూర్ణచంద్ర కళాధరి

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 

సృష్టించిన మూలశక్తి

అష్టాదశ పీఠాలను 

అధిష్టించు ఆదిశక్తి


మహాకనకదుర్గా విజయకనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరిత


చరణం 1:


ఓంకార రావాల 

అలల కృష్ణాతీరంలో

ఇంద్రకీల గిరిపైన 

వెలసెను కృతయుగములోన

ఈ కొండపైన అర్జునుడు 

తపమును కావించెను

పరమశివుని మెప్పించి 

పాశుపతము పొందెను


విజయుడైన అర్జునుని పేరిట.. 

విజయవాడ అయినది ఈ నగరము

జగములన్నియు జేజేలు పలుకగ.. 

కనకదుర్గకైనది స్ధిరనివాసము

మేలిమి బంగరు ముద్దపసుపు.. 

కలగలిపిన వెన్నెలమోము


కోటి కోటి ప్రభాతాల 

అరుణిమయే కుంకుమ

అమ్మ మనసుపడి అడిగి ధరించిన 

కృష్ణవేణి ముక్కుపుడక

ప్రేమ కరుణ వాత్సల్యం.. 

కురిపించే దుర్గరూపం

ముక్కోటి దేవతలందరికి.. 

ఇదియే పుట్టిదీపం


మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా

పరాశక్తి లలితా.. శివానంద చరిత


చరణం 2:


దేవీ నవరాత్రులలో 

వేదమంత్ర పూజలలో

స్వర్ణ కవచములు 

దాల్చిన కనకదుర్గాదేవి


భవబందాలను బాపే.. 

బాలా త్రిపురసుందరి

నిత్యానందము కూర్చే.. 

అన్నపూర్ణాదేవి

లోకశాంతినే సంరక్షించే 

సుమంత్రమూర్తి.. గాయత్రీ

అక్షయ సంపదలెన్నో 

అవని జనుల కందించే 

దివ్య రూపిణీ.. మహాలక్ష్మి

విద్యా కవన గాన మొసగు 

వేదమయి.. సరస్వతి

ఆయురారోగ్యాలు భోగభాగ్యములు 

ప్రసాదించే.. మహాదుర్గ


శత్రు వినాసిని సత్యస్వరూపిని.. 

మహిషాసురమర్ధిని

విజయకారిణి అభయ రూపిణి.. 

శ్రీరాజరాజేశ్వరి


భక్తులందరికి కన్నుల పండుగ 

అమ్మా.. నీ దర్శనం

దుర్గమ్మా.. నీ దర్శనం


మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా

పరాశక్తి లలితా.. శివానంద చరిత

మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా

పరాశక్తి లలితా.. శివానంద చరిత


పాటల ధనుస్సు 

ఆకులో ఆకునై పూవులో పూవునై | Akulo akunai poovulo puvunai | Song Lyrics | Meghasandesam (1982)

ఆకులో ఆకునై.. పూవులో పూవునై



చిత్రం :  మేఘసందేశం (1982)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


ఆకులో ఆకునై.. పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై

ఈ అడవి దాగిపోనా.. హా.. 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా


ఆకులో ఆకునై.. పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై

ఈ అడవి దాగిపోనా.. హా.. 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా



చరణం 1:


గలగలని వీచు చిరుగాలిలో కెరటమై

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై

జలజలని పారు సెల పాటలో తేటినై

పగడాల చిగురాకు తెరచాటు చేటినై

పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై


ఈ అడవి దాగిపోనా 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడవి దాగిపోనా 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా


చరణం 2:


తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల


చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా.. దాహమా.. చింతలా.. వంతలా

ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడా

ఈ అడవి దాగిపోనా 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా..

ఈ అడవి దాగిపోనా 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా..


ఆకులో ఆకునై.. పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై

ఈ అడవి దాగిపోనా.. హా.. 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా...

ఎటులైనా ఇచటనే ఆగిపోనా


పాటల ధనుస్సు  


13, అక్టోబర్ 2023, శుక్రవారం

ఆకాశదేశానా ఆషాడమాసానా | Akasa desana Ashada masana | Song Lyrics | Meghasandesam (1982)

ఆకాశదేశానా..  ఆషాడమాసానా



చిత్రం :  మేఘసందేశం (1982)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  ఏసుదాసు



పల్లవి:


ఆకాశదేశానా..  ఆషాడమాసానా

మెరిసేటి ఓ మేఘమా.. 

మెరిసేటి ఓ మేఘమా

విరహమో.. దాహమో.. 

విడలేని మోహమో..

వినిపించు నా చెలికి 

మేఘసందేశం.. మేఘసందేశం..


చరణం 1:


వానకారు కోయిలనై.. 

తెల్లవారి వెన్నెలనై

వానకారు కోయిలనై.. 

తెల్లవారి వెన్నెలనై

ఈ ఎడారి దారులలో 

ఎడద నేను పరిచానని.. 

కడిమివోలె నిలిచానని

ఉరమని తరమని ఊసులతో 

ఉలిపిరి చినుకుల బాసలతో..

విన్నవించు నా చెలికి విన్న వేదనా.. 

నా విరహ వేదనా


ఆకాశదేశానా..  ఆషాడమాసానా

మెరిసేటి ఓ మేఘమా.. 

మెరిసేటి ఓ మేఘమా


చరణం 2:


రాలుపూల తేనియకై 

రాతిపూల తుమ్మెదనై

రాలుపూల తేనియకై 

రాతిపూల తుమ్మెదనై

ఈ నిశీధి నీడలలో 

నివురులాగ మిగిలానని.. 

శిధిల జీవినైనాని

తొలకరి మెరుపుల లేఖలతో 

రుధిర భాస్పజల ధారలతో.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

విన్నవించు నా చెలికి మనోవేదనా 

నా మరణయాతనా


ఆకాశదేశానా..  ఆషాడమాసానా

మెరిసేటి ఓ మేఘమా.. 

మెరిసేటి ఓ మేఘమా

విరహమో.. దాహమో.. 

విడలేని మోహమో..

వినిపించు నా చెలికి 

మేఘసందేశం.. మేఘసందేశం..


పాటల ధనుస్సు 




పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నె పిల్లవని కన్నులున్నవని | Kannepillavani Kannulunnavani | Song Lyrics | Akali Rajyam (1980)

కన్నె పిల్లవని కన్నులున్నవని చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు, జానకి  పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు