RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
Eduretha songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Eduretha songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఏప్రిల్ 2025, బుధవారం

ఎదురీతకు అంతము లేదా | Edureethaku Antamuleda | Song Lyrics | Edureetha (1977)

ఎదురీతకు అంతము లేదా



చిత్రం :  ఎదురీత (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత : శ్రీరంగం శ్రీనివాసరావు

నేపథ్య గానం :  బాలు 


పల్లవి :


ఉమ్మ్.. ఉం.. ఉమ్మ్.. ఉమ్మ్మ్...


ఎదురీతకు అంతము లేదా... 

నా మదిలో రేగే గాయం మానిపోదా

ఎదురీతకు అంతము లేదా... 

నా మదిలో రేగే గాయం మానిపోదా

వాడిన ప్రేమ వసంతం... 

ఏనాడయిన వికసించి రాదా


ఎదురీతకు అంతము లేదా... 

నా మదిలో రేగే గాయం మానిపోదా


చరణం 1 :


సాగరమే నా చేరువనున్నా... 

దాహం తీరదులే

తీరాలేవో చేరుతువున్నా... 

దూరం మారదులే

ఇది నడి ఏట తీరాల వేట... 

ఇంకెనాాళ్ళు ఈ ఎదురీత


ఎదురీతకు అంతము లేదా... 

నా మదిలో రేగే గాయం మానిపోదా


చరణం 2 :


చేయని నేరం చెలిమిని కూడా 

మాయం చేసేనా

మాసిన మదిలో మమతలు కూడా 

గాయం చేసేనా 

నా యను వారే పగవారైతే... 

ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత


ఎదురీతకు అంతము లేదా... 

నా మదిలో రేగే గాయం మానిపోదా

వాడిన ప్రేమ వసంతం... 

ఏనాడయిన వికసించి రాదా


ఎదురీతకు అంతము లేదా... 

నా మదిలో రేగే గాయం మానిపోదా


- పాటల ధనుస్సు 


తొలిసారి ముద్దివ్వమంది | Tholisari Muddivvamandi | Song Lyrics | Edureetha (1977)

తొలిసారి ముద్దివ్వమంది



చిత్రం :  ఎదురీత (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


తొలిసారి ముద్దివ్వమంది... 

చెలిబుగ్గ చేమంతి మొగ్గ

ఓ..ఓ..ఓ..ఓ...

తొలిసారి ముద్దివ్వమంది... 

చెలిబుగ్గ చేమంతి మొగ్గ


పెదవులలో మధువులనే 

కోరి కోరి చేరి

ఒకసారి రుచి చూడమంది 

చిరుకాటు ఈ తేనెటీగ

ఆ... ఆ.. ఆ.. ఆ

ఉమ్మ్..ఉమ్మ్మ్... ఉమ్మ్..

ఆ... ఆ.. ఆ.. ఆ

ఉమ్మ్..ఉమ్మ్మ్... ఉమ్మ్.. 


చరణం 1 :


నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం.. 

తెరచాటు సొగసులారబోసి నాకోసం..

నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం.. 

తెరచాటు సొగసులారబోసి నాకోసం


నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..

నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..

నీ ఊపిరి తాకి... మనసు వేణువులూదే..


తొలిసారి ముద్దివ్వమంది.. 

చెలిబుగ్గ చేమంతి మొగ్గ


చరణం 2 :


నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం.. 

సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..

నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం.. 

సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..


నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..

నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..

నీ నడకలలోనే...  వయసు మువ్వలు మోగే..


ఒకసారి రుచి చూడమంది 

చిరుకాటు ఈ తేనెటీగ


చరణం 3 :


ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా.. 

ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా..

ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా.. 

ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా


నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..

నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..

తొలిమచ్చికలోనే... సగమిచ్చిన హాయీ...


తొలిసారి ముద్దివ్వమంది.. 

చెలిబుగ్గ చేమంతి మొగ్గ


పెదవులలో మధువులనే 

కోరి కోరి చేరి

ఒకసారి రుచి చూడమంది 

చిరుకాటు ఈ తేనెటీగ


- పాటల ధనుస్సు 


31, అక్టోబర్ 2023, మంగళవారం

ఈ రాధ చివరకు ఏమైనా | Ee Radha Chivariki Emaina | Song Lyrics | Edureetha (1977)

ఈ రాధ చివరకు ఏమైనా



చిత్రం :  ఎదురీత (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత : సినారె  

నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే 

ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే 

కలలన్నీ అలలైన యమునా నదిలో... 

కలతల కన్నీరే...


ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే 


చరణం : 1


బృందావనిలో బిగికౌగిలిలో... 

అల్లికలేమాయే... కలయికలేమాయే...

వ్రేపల్లియలో.. వేణువు ఎదలో.. 

గీతికలేమాయే... 

మధురాపురిలో.. నడిరాతిరిలో... 

మాధవుడేమాయే...


ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే 


చరణం : 2


మరుమల్లెలలో... విరిజల్లులలో.. 

మల్లికలేమాయే... మధురిమలేమాయే..  

ఆ కన్నులలో... వెన్నెల దాచిన 

పున్నమలేమాయే...

చేసిన బాసలు.. పూచిన ఆశలు.. 

రాలిన పూలాయే...


ఈ రాధ చివరకు ఏమైనా.. 

ఆ గాధ నీదేలే


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు