RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
agni parvatham movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
agni parvatham movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, మే 2024, మంగళవారం

వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాలా | Vayyaralu Singaralu | Song Lyrics | Agni Parvatham (1985)

వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాలా



చిత్రం : అగ్ని పర్వతం (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి  


పల్లవి :


వయ్యారాలు సింగారాలు 

ఒంటి ముత్యాలా

ఆహా పూసే పువ్వు..నవ్వే నవ్వు 

నోటిముత్యాలా


ఆహా... వయ్యారాలు సింగారాలు  

ఒంటి ముత్యాలా

ఆహా పూసే పువ్వు..నవ్వే నవ్వు  

నోటిముత్యాలా


అందాలమ్మా ఆటపాట... 

ఆణిముత్యాలా

బింకాలన్నీ ఎండల్లోన... 

మంచుముత్యాలా

వన్నే చిన్నే వాటాలన్నీ... 

వెన్నెల ముత్యాలా

వన్నే చిన్నే వాటాలన్నీ... 

వెన్నెల ముత్యాలా


ఆహా.. వయ్యారాలు సింగారాలు 

ఒంటి ముత్యాలా

ఆహా పూసే పువ్వు... నవ్వే నవ్వు 

నోటిముత్యాలా


తకిట తనం తానం తనంతానం

తకిట తనం తానం తనంతానం


చరణం 1 :


నీరెండల్లో నీ అందాలు... 

నారింజల్లో రత్నాలూ

పూదండల్లో దారంలాగా 

నా గుండెల్లో రాగాలూ


కంటిముద్దు పెట్టేలోగా... 

గాలిచీర కట్టేలోగా

నల్లనిజళ్ళో  నీలాలన్నీ 

ఎవ్వరికిస్తావో


వేకువమ్మ చూసేలోగా 

పాపిటంతతీసేలోగా

నున్నని మెళ్ళో వెన్నెలహారం..

ఎప్పుడు వేస్తావూ


మందారమొగ్గకన్న బుగ్గెర్రనా..

మాణిక్యరవ్వ కన్నా తానెర్రనా

మరుమల్లెపూవు కన్నా తను తెల్లనా

ఎన్నెల్లో పాల కన్నా ఎద తెల్లనా


ఆహా వయ్యారాలు సింగారాలు 

ఒంటి ముత్యాలా

ఆహా పూసే పువ్వు... నవ్వే నవ్వు 

నోటిముత్యాలా


చరణం 2  :


నా కళ్ళల్లో నీ రూపాలు 

వాకిళ్ళల్లో దీపాలూ

దీపాలన్నీ చిదిపే నిన్ను 

చేసారేమో దైవాలూ


లేతపూలు కోసేలోగా 

శీతగాలి వీసేలోగా

చల్లని నీడల చాటున సందడి 

ఎప్పుడు చేస్తావో


ఎర్రబొట్టు పెట్టేలోగా... 

కుర్రపొద్దు పుట్టేలోగా

చీకటి సందున చిక్కిన కౌగిలికి 

ఎప్పుడు వస్తావో


చామంతి చెంపమీద చెయ్యేసుకో...

పారాణి ఆశలన్ని పండించుకో

సిగ్గింటి గోడదాటి నన్నందుకో... 

ముద్దింటిదారితోక్కి నన్నేలుకో


ఆహా వయ్యారాలు సింగారాలు 

వంటి ముత్యాలా

ఆహా పూసే పువ్వు..నవ్వే నవ్వు 

నోటిముత్యాలా


అందాలమ్మా ఆటపాట..

ఆణిముత్యాలా

బింకాలన్నీ ఎండల్లోన... 

మంచుముత్యాలా

వన్నే చిన్నే వాటాలన్నీ..

వెన్నెలముత్యాలా

వన్నే చిన్నే వాటాలన్నీ..

వెన్నెలముత్యాలా


ఆహా వయ్యారాలు సింగారాలు 

వంటి ముత్యాలా

ఆహా పూసే పువ్వు..నవ్వే నవ్వు 

నోటిముత్యాలా 


మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హూ మ్మ్ మ్మ్ మ్మ్

తననం తనన తననం తనన..

తననం తనన

తననం తనన తననం తనన..

తననం తనన


- పాటల ధనుస్సు 





24, అక్టోబర్ 2023, మంగళవారం

ఈ గాలిలో ఎక్కడో అలికిడి | Ee Galilo Ekkado Alikidi | Song Lyrics | Agni Parvatham (1985)

ఈ గాలిలో ఎక్కడో అలికిడి అక్కడే అలజడి



చిత్రం : అగ్ని పర్వతం (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి :


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ

ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..

ఎక్కడో అలికిడి...హా… 

అక్కడే అలజడి..మ్మ..హా..

మత్తుగా తడబడి...  

మెత్తగా జతబడి

పెట్టెను కౌగిలి ఒక వంకా...  

పెట్టెను చెక్కిలి నెలవంక

ఏమౌతదో ఏమిటో...ఓ... ఓ...


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ…

ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..

ఎక్కడో అలికిడి 

అక్కడే అలజడి

మత్తుగా తడబడి... 

మెత్తగా జతబడి

చెక్కిలిగుంటలు ఒకవంకా... 

చక్కిలిగింతలు ఒక వంక

ఈ కాస్తకే ఎందుకో.....


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...


చరణం 1 :


 నవ్విన వేళ మధుమాసంలా 

విరబూసే నా కోర్కేలే…

పువ్వూ నేను పుట్టిన నాడే 

వాలాము నీ పక్కనే…

వేసవి వడిలో వెన్నెల తడిలా

తనువులు కలిపే పెదవుల పొడిలో

ఈ ప్రేమ పందిళ్ళలో...ఓ..ఓ..


ఈ గాలిలో..ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ

ఈ గాలిలో...ఓ...ఓ...ఓ

ఎక్కడో అలికిడి.. హా.. హా..

అక్కడే అలజడి..హా..హా..

మత్తుగా తడబడి మెత్తగా జతబడి

పెట్టెను కౌగిలి ఒక వంక..హా..

పెట్టెను చెక్కిలి నెలవంక

ఈ కాస్తకే.. ఎందుకో..ఓ...ఓ..


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ

లలలల లలలల..లలలల లలలల..

లల లలలా లలల..


చరణం 2 :


తాకిన చోటా తాంబూలంలా 

ఎరుపెక్కె నీ చెక్కిలీ

పొద్దూ ముద్దూ పుట్టే చోట...  

ఎరుపెక్కవా ఆ దిక్కులే..

ఎద చలి పెరిగీ ఎదరకు జరిగే

కథ ఇక మొదలై కౌగిట బిగిసే

ఈ సందె సయ్యాటలో..ఓ..ఓ..


ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… 

ఓ...ఓ...ఓ

ఈ గాలిలో..ఓ..ఓ..ఓ..ఓ

ఎక్కడో అలికిడి..హా..హా..

అక్కడే అలజడి..హా..హా..

మత్తుగా తడబడి 

మెత్తగా జతబడి

పట్టెను కౌగిలి ఒక వంక..

పెట్టెను చెక్కిలి నెలవంక

ఈ కాస్తకే ఎందుకో..ఓ...ఓ..ఓ..


- పాటల ధనుస్సు 





18, ఆగస్టు 2023, శుక్రవారం

ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం | Ide Ide Ragulutunna Agniparvatham | Song Lyrics | Agni Parvatham (1985)

ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం



చిత్రం : అగ్ని పర్వతం (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, 


పల్లవి

ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం

ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం

ఇదే ఇడె మండుతున్న మానవ హౄదయం

రక్తంతో రాసుకున్న రాక్షస గీతం


చరణం 1:

సప్త తాలముల చాటునా 

సర్వ ధర్మములు మరిచి

వంచనతొ వాలి వధ గావించిన 

స్వార్ధపరుడు ఈ రాముడు కాదా

అది కాదా నేరం దానికి లేదా శిక్ష

రధ చక్రం కుంగినప్పుడు 

వక్ర ధర్మమును అనుసరించి

రాధేయుడిని చంపించిన రాజకియ 

సుత్రధారి ఈ కృష్ణుడు కాదా

అది కాదా పాపం దానికి లేదా శిక్ష

ఇదేన భవయామి ధర్మం 

ఇదేనా రక్షయామి చట్టం

ఆ డెవుడి పాపాలే లొఖానికి పుణ్యమా

ఆ దేవుడి ధర్మమును నే చేస్తే నేరమా


చరణం 2:

కన్న తల్లి కన్నీళ్లకు  

ఏ ఖరిదు కటింది కసాయి లోఖం

అదా లొక ధర్మం ఇదా మీకు న్యాయం

తప్పటడుగులు వేస్తు 

తల్లి శవం లాగినప్పుడు 

కరుణించిందా సంఘం

ఇది కాదా ధారుణం 

ఇది కాదా అక్రమం

ఇదేనా సకల వేద సారం 

ఇదేనా వేదవిహిత ధర్మం

దానవ మానవ సంగటు 

ధర్మానికి లొంగనా

రగులుతున్న హౄదయాగ్ని 

నేనే బలి అవ్వనా


- పాటల ధనుస్సు 




పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు