RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
toorpu velle railu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
toorpu velle railu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మార్చి 2024, మంగళవారం

సందపొద్దు అందాలున్న చిన్నదీ | Sandapoddu andalunna | Song Lyrics | Toorpu Velle Railu (1979)

సందపొద్దు అందాలున్న చిన్నదీ



రచన : జాలాది రాజారావు,

సంగీతం : SP బాలసుబ్రహ్మణ్యం 

గానం : బాలు, సుశీల 

చిత్రం : తూర్పు వెళ్లే రైలు (1979)


పల్లవి :

సందపొద్దు అందాలున్న చిన్నదీ

ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

సందపొద్దు అందాలున్న చిన్నదీ

ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

బొమ్మలా ముద్దుగుమ్మలా

పువ్వులా పాలనవ్వులా

మెరుపుతీగమల్లే తళుకుమంటే

ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా


సందపొద్దు అందాలున్న చిన్నదీ

ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ


చరణం 1 :


ఆకతాయి బుల్లోడల్లే అల్లరెడితే

రాలుగాయి రాగాలన్ని రచ్చబెడితే

ఎవ్వరైన చూసారంటే 

అల్లరైపోతానయ్యో

ఎన్నెలంటి బతుకంతా 

చీకటైపోతాదయ్యో

దీపమల్లే నేనుంటాను 

తీపి రేపు తెస్తుంటాను

దీపమల్లే నేనుంటాను 

తీపి రేపు తెస్తుంటాను


కలవపువ్వు నీవై ఎలుగు నేనై

ఎలతేటి పాటల్లే చెలరేగిపోనా


చరణం 2:


ముత్తెమంటి ఒళ్ళు 

తడిసి ముద్దు పుడితే

గుండెలోన ఎండకాసి ఆరబెడితే

ఆశలారిపోకుండా 

ఊసులాడుకోవాలి

ఊసులెండిపోకుండా 

ఊట కోర్కెలుండాలి

గువ్వలాటి జోడుండాలి 

యవ్వనాల గూడెయ్యాలి

గువ్వలాటి జోడుండాలి 

యవ్వనాల గూడెయ్యాలి


నిన్ను నన్ను చూసి దిష్టి తీసి

ఆ లోకాల దేవుళ్ళే దీవించిపోవాలి


సందపొద్దు అందాలున్న చిన్నదీ

ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

బొమ్మలా ముద్దుగుమ్మలా

పువ్వులా పాలనవ్వులా

మెరుపుతీగమల్లే తళుకుమంటే

ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా


సందపొద్దు అందాలున్న చిన్నదీ

ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ


పాటల ధనుస్సు  


23, అక్టోబర్ 2023, సోమవారం

చుట్టూ చెంగావి చీర | Chuttu chengavi Cheera | Song Lyrics | Toorpu Velle Railu (1979)

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ



చిత్రం  : తూర్పు వెళ్లే రైలు (1979)

సంగీతం : S.P. బాలసుబ్రమణ్యం 

రచన  : ఆరుద్ర 

గానం  :S.P. బాలసుబ్రమణ్యం 


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి

ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ


తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా

నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా

ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా 

 పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ 


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ 


నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు

ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు

వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు

వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లూ


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ 

బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి

ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..


చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు