RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, మార్చి 2022, ఆదివారం

పలికినది పిలిచినది | Palikinadi Pilichinadi | Song Lyrics | Seetha Ramulu (1980)

పలికినది పిలిచినది



చిత్రం :  సీతారాములు (1980)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు,  సుశీల   


సాకీ :


వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి

సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి

నిరుపమ శుభగుణలోల నిరతజయాప్రదశీల

వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి

సరసీజాసన జనని.. జయ జయ జయ...



పల్లవి :



పలికినది... పిలిచినది ...

పరవశమై నవమోహనరాగం


పలికినది... పిలిచినది ...

పరవశమై నవమోహన రాగం

పలికినది ....పిలిచినది.. 


చరణం 1 :


గగనాంగనాలింగనోత్సాహియై... 

జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై

గగనాంగనాలింగనోత్సాహియై ...

జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై..

మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...

మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...

మనసులు వీసిన ప్రేమ గంధమై ....

పలికినది... పిలిచినది.. 

పరవశమై నవమోహనరాగం

పలికినది పిలిచినది.. 


చరణం 2  :



గంగా తరంగాల సంగీతమై... 

కమణీయ రమణీయ యువగీతమై

గంగా తరంగాల సంగీతమై... 

కమణీయ రమణీయ యువగీతమై


కలిమికి లేమికి తొలి వివాహమై...

కలిమికి లేమికి తొలి వివాహమై..

యువతకు నవతకు రసప్రవాహమై...

పలికినది పిలిచినది... 

పరవశమై నవమోహనరాగం

పలికినది పిలిచినది.. 



చరణం 3 :


మలయాద్రి పవనాల అలాపనై ...

మధుమాస యామిని ఉద్ధీపనై ...

మలయాద్రి పవనాల అలాపనై ...

మధుమాస యామిని ఉద్ధీపనై...

అనురాగానికి ఆది తాళమై..

అనురాగానికి ఆది తాళమై ...

ఆనందానికి అమర నాదమై...

పలికినది పిలిచినది... 

పరవశమై నవమోహనరాగం

పలికినది పిలిచినది..


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు