RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

30, మార్చి 2022, బుధవారం

క్షేమమా ప్రియతమా | Kshemama Priyathama | Song Lyrics | Adavi Simhalu (1983)

క్షేమమా ప్రియతమా



చిత్రం: అడవి సింహాలు (1983)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి:


ఏహే ఏహే లాలలాలలా

ఆహా ఆహా లాలలాలలా


క్షేమమా.. ప్రియతమా .. 

సౌఖ్యమా.. నా ప్రాణమా....


కుసుమించే అందాలు.. కుశలమా... 

వికసించే పరువాలు.. పదిలమా..


మరల మరల వచ్చిపో వసంతమా... 

చూసిపోవే నన్ను సుప్రభాతమా

మరల మరల వచ్చిపో వసంతమా... 

చూసిపోవే నన్ను సుప్రభాతమా


క్షేమమా.. ప్రియతమా .. 

సౌఖ్యమా.. నా ప్రాణమా....


కుసుమించే అందాలు.. కుశలమా... 

వికసించే పరువాలు.. పదిలమా..


మరల మరల వచ్చిపో వసంతమా... 

చూసిపోవే నన్ను సుప్రభాతమా

మరల మరల వచ్చిపో వసంతమా... 

సిపోవే నన్ను సుప్రభాతమా..


క్షేమమా.. ప్రియతమా .. 

సౌఖ్యమా.. నా ప్రాణమా....



చరణం 1:



నీలి కురుల వాలు జడల చాటు 

నడుము కదలిక.. కుశలమా

అడగలేక అడుగుతున్న 

తీపి వలపు కానుక.. పదిలమా


నీ లోని దాహాలు అవి రేపే విరహాలు 

చెలరేగే మోహాలు.. క్షేమమా..


నీలి కురుల వాలు జడల చాటు 

నడుము కదలిక.. కుశలమా

అడగలేక అడుగుతున్న 

తీపి వలపు కానుక.. పదిలమా


నీ లోని దాహాలు అవి రేపే విరహాలు 

చెలరేగే మోహాలు.. క్షేమమా..


చలి గాలి గిలిగింత సౌఖ్యమా..

చెలి మీద వలపంతా సౌఖ్యమా..

నీ క్షేమమే..నా లాభము .. 

నీ లాభమే..నా మోక్షము


క్షేమమా.. ప్రియతమా .. 

సౌఖ్యమా.. నా ప్రాణమా....


కుసుమించే అందాలు.. కుశలమా... 

వికసించే పరువాలు.. పదిలమా..


మరల మరల వచ్చిపో వసంతమా... 

చూసిపోవే నన్ను సుప్రభాతమా

మరల మరల వచ్చిపో వసంతమా... 

చూసిపోవే నన్ను సుప్రభాతమా..



చరణం 2:


కాలమల్లె కరిగిపోని 

గాఢమైన కౌగిలి.. కుశలమా

నన్ను తప్ప ఎవరినింక 

తాకలేని చూపులు.. పదిలమా


నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు 

అవి దాచే నీ సిగ్గు క్షేమమా


కాలమల్లె కరిగిపోని 

గాఢమైన కౌగిలి.. కుశలమా

నన్ను తప్ప ఎవరినింక 

తాకలేని చూపులు.. పదిలమా

నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు 

అవి దాచే నీ సిగ్గు క్షేమమా


తహతహలు తాపాలు.. సౌఖ్యమా..

బిడియాలు బింకాలు.. సౌఖ్యమా

నీ సౌఖ్యమే.. నా సర్వమూ .. 

ఆ సర్వమూ.. నా సొంతమూ..


క్షేమమా.. ప్రియతమా ..

సౌఖ్యమా.. నా ప్రాణమా..

కుసుమించే అందాలు కుశలమా.. 

వికసించే పరువాలు పదిలమా

మరల మరల వచ్చిపో వసంతమా.. 

చూసిపోవే నన్ను సుప్రభాతమా


క్షేమమా.. ప్రియతమా ..

సౌఖ్యమా.. నా ప్రాణమా..

కుసుమించే అందాలు కుశలమా.. 

వికసించే పరువాలు పదిలమా

మరల మరల వచ్చిపో వసంతమా.. 

చూసిపోవే నన్ను సుప్రభాతమా


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు