RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, మార్చి 2022, శుక్రవారం

పగటి పూట చంద్రబింబం | Pagatipoota Chandrabimbam | Song Lyrics | Chikkadu Dorakadu (1967)

పగటి పూట చంద్రబింబం



చిత్రం : చిక్కడు-దొరకడు (1967)

సంగీతం : టి. వి. రాజు

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల, పి. బి. శ్రీనివాస్




సాకి : 



విరిసిన ఇంద్రచాపమో... భువిన్ ప్రభవించిన చంద్రబింబమో..

మరు పువుబంతియో... రతియో... మల్లెలదొంతియో... మోహకాంతియో

సరస కవీంద్రకల్పిత రసాకృతియో... నవరాగ గీతియో...

వరసరసీరుహానన బిరాన వరించి తరింప జేయవే 


పల్లవి :



పగటి పూట చంద్రబింబం అగుపించెను...  ఏదీ ఏదీ

అందమైన నీ మోమే అదిగా కింకేది

కానరాని మన్మధుడేమో కనుపించెను... ఏడీ ఏడీ

ఎదుటవున్న నీవేలే ఇంకా ఎవరోయీ 



చరణం 1 :


వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ

వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ.. ఏవీ ఏవీ

అవి నీ సిగలోనే ఉన్నాయి


పదును పదును బాణాలేవో ఎదను నాటుకుంటున్నాయీ

పదును పదును బాణాలేవో ఎదను నాటుకుంటున్నాయీ...  

ఏవీ ఎవీ

అవి నీ ఓరచూపులేనోయీ


పగటి పూట చంద్రబింబం అగుపించెను...  

ఏదీ ఏదీ

అందమైన నీ మోమే అదిగా కింకేది 



చరణం 2 :


ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు

ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు



ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు

ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు

ఏమో..  ఏమో...  

ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే.. ఇంతేనేమో 



అహహ.. ఆహహహా.. ఓహోహో..ఓ..ఓహొ..ఓహో...


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు