నామది మధురా నగరి
చిత్రం: శంకు తీర్ధం (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల
నామది మధురా నగరి
ని యెద యమునాలహరి
కృష్ణ సంగీత మురళి రాధ రాగల రవలి
కలసి పిరిసింది అందాల బృందావని
చంచల కిరణం నయనం
హరిచందన కలశం వదనం
నీ నీలికురులు నా నీలగిరులు
నీ చిలిసి కనులు నావలపు వనులు
ఇవి సంగమించు సంగీత నదులు
రవి చూడలేని సాహిత్య నిధులు
నీ కరాలు హిమ శికరాలు
నీ పదాలు ప్రణయాస్పదాలు
అంతులేని అనురాగ సాగరాలు
వెన్నెల కెరటం అధరం
అది మధురిమ కన్నా మధురం
మనరాసలీల మధుమాస హేల
సప్త స్వరాల రాగాల డోల
మన జవ్వనాలు నవనందనాలు
హిమ తుషారాలు సుమకుటీరాలు
వీక్షణాలు అతి తీక్షణాలు
ప్రణయ కావ్య మధురాక్షరాలు
శతవసంత శరద్వేణు స్వాగతాలు
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి