ఈవేళలో ఈ పూలలో
చిత్రం: శంకు తీర్ధం (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా. సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల
ఈవేళలో ఈ పూలలో
ఎన్నెన్ని భావనలో
ఏమవున రాగిణులో
దేవుని చరణాల వాలాలనీ !
చరణం 1
నెమలి ఆడినా కోయల పాడినా
ఆదేవుని ఆరాధనకే
మెరుపు మెరిసినా - మబ్బుకురిసినా
పరమాత్ముని అభిషేకానికే
ప్రతి కిరణం వెలుగుతుంది
ప్రతి పవనం సాగుతుంది. ఆ
దేవుని సన్నిధి చేరాలని !!
చరణం :2
కల్లలు ఎరుగని కలతలు లేని
ఈ చల్లని సుమవనిలోన
వెదురు వెదురులో విరుల పొదలలో
ఉదయించే స్వరనిదులలోన
ప్రతి అణువు పరవశించే !
నా మనసే పల్లవించే
దేవుని నీడను నిలవాలనీ !!
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి