ఏవండోయ్ శ్రీమతిగారు
చిత్రం : సీతారాములు (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, జయప్రద
పల్లవి :
ఊఁ... ఉహు...హు... హుహు...
ఏవండోయ్ శ్రీమతిగారు..
లేవండోయ్ పొద్దెక్కింది..
ఏవండోయ్ శ్రీమతిగారు..
లేవండోయ్ పొద్దెక్కింది..
ఇల్లు ఊడ్చాలి.. కళ్ళాపు చల్లాలి..
నీళ్ళు తోడాలి.. ఆపై కాఫీ కాయాలీ..ఈ..
ఏవండోయ్ శ్రీమతిగారు..
లేవండోయ్ పొద్దెక్కింది..
చరణం 1 :
హబ్బ.. ప్లీజ్.. ఒక్క గంటండీ..
గంటా గంటని అంటూ ఉంటే లోనుంచీ ఆకలి మంటా..
మంటా మంటని గిజ గిజమంటే అమ్మానాన్నతో తంటా..
మంటను మరి చేసి తలుపులు మూసేసీ..
దుప్పటి ముసుగేసి సరిగమ పాడేసి..
ఆఫీసుకి నామం పెడితే ఆడబాసుతో తంటా..
హూఁ 'Who is that రాక్షసి'
ఉన్నది ఒక శూర్పణఖా.. లేటైతే నొక్కును నా పీకా..
ఆపై ఇచ్చును ఒక లేఖా.. ఆ లేఖతో ఇంటికి రాలేకా..
నలిగి నలిగి.. కుమిలి కుమిలి.. చచ్చి చచ్చి.. బ్రతికి బ్రతికి..
అయ్యబాబోయ్..
అందుకే..
ఏమండోయ్ శ్రీమతిగారూ..
లేవండోయ్ పొద్దెక్కింది.. హబ్బా..
చరణం 2 :
కాఫీ.. కాఫీ..
కాఫీ కాఫీ అంటూ ఉంటే ఉలకరు పలకరు ఏంటంటా...
వంటా వార్పు చేసేది ఇంటికి పెళ్ళామేనంటా...
అఫ్కోర్స్ నాకు రాదే.. ఒక్కసారి చేసి చూపించండీ...
మ్మ్.. పాలను మరిగించీ.. గ్లాసులో పోసేసి
పౌడరు కలిపేసీ.. స్పూనుతో తిప్పేసి
వేడిగ నోటికి అందిస్తే..
నాన్సెన్స్.. చక్కెర లేదు..
హబ్బా.. అరవకు అరవకు ఓ తల్లీ..
అరిస్తె ఇల్లే బెంబెల్లీ.. ఇరుగూపొరుగూ బయల్దేరి
నిన్నూ నన్నూ చూసెళ్ళి...
ఇంటా బయటా.. ఊరూ వాడా.. గుస గుసలాడేస్తే
నిజంగా..
నీతోడు అందుకే..
ఏవండోయ్ శ్రీమతిగారు..
ఆగండోయ్ చల్లారండీ.
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి