అందాల కృష్ణయ్య వేణుగాన మధురిమలు
Lyrics : Ramakrishna Duvvu
Composing : Sivala Raghuram,
Singer : Moola Srilatha,
Audio Digital Recording : Sri Matha Digital Recording Studio,
Visakhapatnam.
సాకి: శ్రీ కృష్ణా యదుకుల మణిదీపమా
నంద కిషోరా యశోద బహిప్రాణమా
విషపూతన సంహారీ. గోవర్ధన గిరి ధారీ
గోపీ మానస హారీ, బృందావన సంచారీ
చిత్రము గాదే వెదురే మారెను
దివ్య వేణువుగ
నీ మురళీ రాగాలాపన లో
తన్మయమందెను భువనాలు
పల్లవి: అందాల కృష్ణయ్య వేణుగాన మధురిమలు
ఆ దివ్య గానాలతో పరవశించు భువనాలు
వికసించే పువ్వులపై వాలేటి తుమ్మెదలు
పచ్చని కోనలతో చక్కటి సెలయేళ్ళతో
అవనిలోన అందమైన ఈ బృందావనము
చరణం: పరవశించి పవనుడు భాగవతునిగా మారి
వేణుగాన మాధుర్యము పలుదెశలా మోయగా
పరిభ్రమిస్తు భానుడు వీనుల పరికించగా
నీలమేఘశ్యామునికి నీరదములు గొడుగు పట్టగా
పులకించి భూదేవి పచ్చని చీర కట్టింది
గోపికల ఆనందం ఆకాశం నిండింది
చరణం: గోవులు చెవులతో సుధలే గ్రోలెనా
పికములు కొమ్మలపై మౌనంగా నిలచెనా
మయూరాలు మైమరచి పింఛముగ మారెనా
శిశువులు, ప్రాణులు నిలిచిన శిల్పాలా
అచరపు తరువులు పరవశించి నాట్యమా
గోపాలుని పిల్లనగ్రోవి పులకరింతలే...
- RKSS Creations...
This song is from the Album Brindavanam created by RKSS Creations.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి