RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, మార్చి 2022, మంగళవారం

కళ్యాణ వైభోగమే | Kalyana Vaibhogame | Song Lyrics | Seetharama Kalyanam (1986)

కళ్యాణ వైభోగమే



చిత్రం  :  సీతారామకళ్యాణం (1986)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  : బాలు, సుశీల 


పల్లవి :


విడిపోము మనమూ...

ఈ ఎడబాటు క్షణమూ...

ఆపైన కళ్యాణము

కళ్యాణ వైభోగమే ... 

కళ్యాణ వైభోగమే...

శ్రీ సీతారాముల కళ్యాణమే... 

మన మాంగళ్యధారణ శుభలగ్నమే


కళ్యాణ వైభోగమే.. 

శ్రీ సీతారాముల కళ్యాణమే...

మన మాంగళ్యధారణ శుభలగ్నమే... 

కళ్యాణ వైభోగమే ...ఏ... 


చరణం 1 :


అనుకున్నా కొన్నాళ్ళ వనవాసము... 

మునుముందు కావాలి మధుమాసము

అనుకున్నా కొన్నాళ్ళ వనవాసము... 

మునుముందు కావాలి మధుమాసము


మన ప్రేమ తుది లేని ఆకాశము...

మన ప్రేమ తుది లేని ఆకాశము....

ప్రతి రోజు పూర్ణిమా శ్రావణము

కళ్యాణ వైభోగమే...ఏ... 


చరణం 2 :


మరులెల్ల మరుమల్లె విరిమాలగా ... 

మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా

మరులెల్ల మరుమల్లె విరిమాలగా ... 

మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా


హృదయాల నామాలె వేదాలుగా...

హృదయాల నామాలె వేదాలుగా ... 

మన అంతరంగాలే వేదికగా...

కళ్యాణ వైభోగమే....ఏ... 


చరణం 3 :


వలచాము నిలిచాము ఒక దీక్షగా... 

మనసైన మనసొకటే సాక్షిగా

వలచాము నిలిచాము ఒక దీక్షగా... 

మనసైన మనసొకటే సాక్షిగా


గెలిచాము కలిశాము దివిమెచ్చగా ...ఆ ..ఆ..

గెలిచాము కలిశాము దివిమెచ్చగా .... 

కలకాలముందాము నులివెచ్చగా...


కళ్యాణ వైభోగమే ....

శ్రీ సీతారాముల కళ్యాణమే... 

మన మాంగళ్యధారణ శుభలగ్నమే...

కళ్యాణ వైభోగమే ...ఏ...

శ్రీ సీతారాముల కళ్యాణమే... 

మన మాంగళ్యధారణ శుభలగ్నమే

కళ్యాణ వైభోగమే....


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా చిత్రం :  సీతామాలక్ష్మి (1978) సంగీతం :  కె.వి. మహదేవన్ గీతరచయిత :  వేటూరి నేపధ్య గానం :  బాలు, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు