శ్యామసుందరుని కాలి అందెల సవ్వడి
Lyrics : Ramakrishna Duvvu
Composing : Smt Kota Krishnaveni,
Singer : Moola Srilatha,
Audio Digital Recording : Sri Matha Digital Recording Studio, Visakhapatnam.
పల్లవి: శ్యామసుందరుని కాలి అందెల
సవ్వడి వినగానే...
భామలందరు వాకిట చేరిరి
చూపుల బంధించ...
వెన్నను చిలికే కవ్వము మిగిలే
గదిలో ఒంటరిగ...
వెన్నుని సొగసులు వెన్నమీగడలు
భామల సొంతముగా
చరణం: నొసటను నిలచిన కస్తూరి కెంతటి
సౌందర్య మబ్బింది
గుండెల మీదను కౌస్తుభ హారము
సౌభాగ్య మందింది
అడవిన పుట్టిన వెదురు చేతిలో
వేణువు అయ్యింది
పగడము లాంటి కృష్ణుని పెదవుల
సుధనే గ్రోలింది
ఎల్లెడలా గోపాల బాలుని సహచర
భాగ్యమే వాటివిగా
దినమంతా యశోద తనయుని
వియోగ వ్యధలే మావిగా
చరణం: వేల పున్నమల చల్లని వెన్నెల
ఆ చూపున కురిసింది
పూదోటలందు దొరకని తేనె
ఆ మాటల్లో దొర్లింది
గోవిందు నంటిన పీతాంబరము
కేరింత లాడింది
మోహన రూపుని రాజసమంతా
నడకల్లో నిలచింది
నందకుమారుని కాంచిన కన్నులు
తరించి పోయెనుగా
ఆతని చూడని వేళల నందవి
సజలములయ్యెనుగా
- RKSS Creations...
This song is from the Album Brindavanam created by RKSS Creations.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి