RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
srinivasa kalyanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
srinivasa kalyanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, నవంబర్ 2024, ఆదివారం

తిప్పరే చెలులారా దొడ్డ తిరగలి | Tippare Chelulara | Sri Padmavathi Kalyanam Song Lyrics | RKSS Creations

 తిప్పరే చెలులారా దొడ్డ తిరగలి



రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:

 

తిప్పరే చెలులారా దొడ్డ తిరగలి 

గొప్పగాదె మరి

అలరి పద్మావతి పాణి చేకొనగ 

వచ్చినాడె హరి

 

తిప్పరే చెలులారా దొడ్డ తిరగలి 

గొప్పగాదె మరి

అలరి పద్మావతి పాణి చేకొనగ 

వచ్చినాడె హరి

 

చరణం 1:

 

అవనిపైన తన దివ్య వెలుగు నింప

అలరు మేలు మంగవై ఇలలో వెలసిన

ఆకాశరాజ సుతగ మురిపాల విలసిల్లెను

 

చతురాననకే అయ్యగు హరిని వలచి

పదునారు భువనాలకు అమ్మవైతివి

అలమేలుమంగవై మముకాచుకొంటివి

 

చరణం 2:

 

వెంకటగిరిపై పచ్చటి వనముల చనునట

అవని చక్రమును తన కనులతొ కాచునట

వేద గానముల స్వరముల ఓలలాడునట

 

దివినేలు పతి ఆకాశరాజసుతను

కాంచుట వలచుట మన వరమట

శ్రీనివాసుడే అలరె పద్మావతి పతట

 

- రామకృష్ణ దువ్వు




16, డిసెంబర్ 2022, శుక్రవారం

జాబిలి వచ్చి జామయ్యింది | Jabilli vache jamayyindi | Song Lyrics | Srinivasa Kalyanam (1987)

జాబిలి వచ్చి జామయ్యింది



చిత్రం :  శ్రీనివాస కల్యాణం (1987)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు,  సుశీల



పల్లవి :


జాబిలి వచ్చి జామయ్యింది... 

జాజులు విచ్చి జామయ్యింది

తాపం పెంచే ఉడుకు దుడుకు 

ముడిపడి ఉరికే వేళయ్యింది.. గోలయ్యింది


జాబిలి వచ్చి జామయ్యిందా? 

జాజులు విచ్చి జామయ్యిందా?

తాపం పెంచే ఉడుకు దుడుకు 

ముడిపడి ఉరికే వేళయిందా? గోలయిందా?


జాబిలి వచ్చి జామయ్యింది...  

జాజులు విచ్చి జామయ్యింది 



చరణం 1 :


పందిరి మంచం ఒంటరి కంటికి 

కునుకునివ్వనంది.. అహా...

వరస కుదరినిదే సరసానికి 

తెరతీయకూడదంది


పందిరిమంచం ఒంటరి కంటికి 

కునుకునివ్వనంది

హ.. హ.. వరసకుదరినిదే సరసానికి 

తెరతీయకూడదంది


వడ్డించిన అందాలన్ని.. 

అడ్డెందుకు అంటున్నాయి

వడ్డించిన అందాలన్ని.. 

అడ్డెందుకు అంటున్నాయి

కళ్యాణం కాకుండానే 

కలపడితే తప్పన్నాయి


జాబిలి వచ్చి జామయ్యింది.. 

జాజులు విచ్చి జామయ్యింది

తాపం పెంచే ఉడుకు దుడుకు 

ముడిపడి ఉరికే వేళయిందా? 

గోలయిందా?

జాబిలి వచ్చి జామయ్యింది.. 

జాజులు విచ్చి జామయ్యిందా? 



చరణం 2 :


అత్త బిడ్డనా హక్కు చూపుతు 

రేచ్చేవబ్బాయి

మరదలివైతె ఏనాడో 

గిరి దాటించేద్దునె అమ్మాయి


అత్త బిడ్డనా హక్కు చూపుతు 

రేచ్చేవబ్బాయి

మరదలివైతె ఏనాడో గిరి 

దాటించేద్దునె అమ్మాయి


హె.. కొంగుముళ్ళు పడకుండానే.. 

పొంగుముదిరి పోనీకోయి

హె.. కొంగుముళ్ళు పడకుండానే.. 

పొంగుముదిరి పోనీకోయి

దొంగ ముద్దుల తీయదనంలొ..  

సంగతేదొ తెల్చేయ్యనీయి


ఆ.. ఆహా... హ... హ

జాబిలి వచ్చి జామయ్యింది..  ఆహా... 

జాజులు విచ్చి జామయ్యిందా?... హ... హ

తాపం పెంచే ఉడుకు దుడుకు 

ముడిపడి ఉరికే వేళయ్యింది... 

హ... హ.. గోలయ్యింది..ఆహా


లలలల... ఆహాఆహా.. హా.. హా...

ఆహాఆహా.. హా.. హా..... ఉ..ఉ..ఉ..ఉ..


పాటల ధనుస్సు  


15, డిసెంబర్ 2022, గురువారం

తొలిపొద్దుల్లో హిందోళం | Toli poddullo hindolam | Song Lyrics | Srinivasa Kalyanam (1987)

తొలిపొద్దుల్లో హిందోళం



చిత్రం :  శ్రీనివాస కల్యాణం (1987)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి



పల్లవి :


ఆ ఆ ఆ అహ హ హ ఆ

తొలిపొద్దుల్లో హిందోళం 

మలిపొద్దుల్లో భుపాళం

తొలిపొద్దుల్లో హిందోళం 

మలిపొద్దుల్లో భుపాళం


నేనుగ మారిన నీకోసం 

నీదైపోయిన నా ప్రాణం

నీకే అంకితం నీవే జీవితం

నీకే అంకితం నీవే జీవితం

తొలిపొద్దుల్లో హిందోళం 

మలిపొద్దుల్లో భుపాళం 


చరణం 1 : 


పచ్చని దేవత పలికే చోట...  

కుంకుమ పువ్వులు చిలికే చోట

తెల్లని మబ్బులు కురిసే చోట....  

ఆ.. ఆ... లోకపు హద్దులు ముగిసే చోట


రెండో చెవిని పడకుండా.. 

మాట ఇచ్చుకుంటా

మూడో కంట పడకుండా.. 

ముద్దు ఇచ్చుకుంటా

రెండో చెవిని పడకుండా ... 

మాట ఇచ్చుకుంటా

మూడో కంట పడకుండా..  

ముద్దు ఇచ్చుకుంటా


నేనుగ మారిన నీకోసం 

నీదైపోయిన నా ప్రాణం

నీకే అంకితం నీవే జీవితం


తొలిపొద్దుల్లో హిందోళం... 

మలిపొద్దుల్లో భుపాళం 


- పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు