RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
alamelu mangamma songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
alamelu mangamma songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, నవంబర్ 2024, ఆదివారం

తిప్పరే చెలులారా దొడ్డ తిరగలి | Tippare Chelulara | Sri Padmavathi Kalyanam Song Lyrics | RKSS Creations

 తిప్పరే చెలులారా దొడ్డ తిరగలి



రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:

 

తిప్పరే చెలులారా దొడ్డ తిరగలి 

గొప్పగాదె మరి

అలరి పద్మావతి పాణి చేకొనగ 

వచ్చినాడె హరి

 

తిప్పరే చెలులారా దొడ్డ తిరగలి 

గొప్పగాదె మరి

అలరి పద్మావతి పాణి చేకొనగ 

వచ్చినాడె హరి

 

చరణం 1:

 

అవనిపైన తన దివ్య వెలుగు నింప

అలరు మేలు మంగవై ఇలలో వెలసిన

ఆకాశరాజ సుతగ మురిపాల విలసిల్లెను

 

చతురాననకే అయ్యగు హరిని వలచి

పదునారు భువనాలకు అమ్మవైతివి

అలమేలుమంగవై మముకాచుకొంటివి

 

చరణం 2:

 

వెంకటగిరిపై పచ్చటి వనముల చనునట

అవని చక్రమును తన కనులతొ కాచునట

వేద గానముల స్వరముల ఓలలాడునట

 

దివినేలు పతి ఆకాశరాజసుతను

కాంచుట వలచుట మన వరమట

శ్రీనివాసుడే అలరె పద్మావతి పతట

 

- రామకృష్ణ దువ్వు




పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు