RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

16, డిసెంబర్ 2022, శుక్రవారం

జాబిలి వచ్చి జామయ్యింది | Jabilli vache jamayyindi | Song Lyrics | Srinivasa Kalyanam (1987)

జాబిలి వచ్చి జామయ్యింది



చిత్రం :  శ్రీనివాస కల్యాణం (1987)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు,  సుశీల



పల్లవి :


జాబిలి వచ్చి జామయ్యింది... 

జాజులు విచ్చి జామయ్యింది

తాపం పెంచే ఉడుకు దుడుకు 

ముడిపడి ఉరికే వేళయ్యింది.. గోలయ్యింది


జాబిలి వచ్చి జామయ్యిందా? 

జాజులు విచ్చి జామయ్యిందా?

తాపం పెంచే ఉడుకు దుడుకు 

ముడిపడి ఉరికే వేళయిందా? గోలయిందా?


జాబిలి వచ్చి జామయ్యింది...  

జాజులు విచ్చి జామయ్యింది 



చరణం 1 :


పందిరి మంచం ఒంటరి కంటికి 

కునుకునివ్వనంది.. అహా...

వరస కుదరినిదే సరసానికి 

తెరతీయకూడదంది


పందిరిమంచం ఒంటరి కంటికి 

కునుకునివ్వనంది

హ.. హ.. వరసకుదరినిదే సరసానికి 

తెరతీయకూడదంది


వడ్డించిన అందాలన్ని.. 

అడ్డెందుకు అంటున్నాయి

వడ్డించిన అందాలన్ని.. 

అడ్డెందుకు అంటున్నాయి

కళ్యాణం కాకుండానే 

కలపడితే తప్పన్నాయి


జాబిలి వచ్చి జామయ్యింది.. 

జాజులు విచ్చి జామయ్యింది

తాపం పెంచే ఉడుకు దుడుకు 

ముడిపడి ఉరికే వేళయిందా? 

గోలయిందా?

జాబిలి వచ్చి జామయ్యింది.. 

జాజులు విచ్చి జామయ్యిందా? 



చరణం 2 :


అత్త బిడ్డనా హక్కు చూపుతు 

రేచ్చేవబ్బాయి

మరదలివైతె ఏనాడో 

గిరి దాటించేద్దునె అమ్మాయి


అత్త బిడ్డనా హక్కు చూపుతు 

రేచ్చేవబ్బాయి

మరదలివైతె ఏనాడో గిరి 

దాటించేద్దునె అమ్మాయి


హె.. కొంగుముళ్ళు పడకుండానే.. 

పొంగుముదిరి పోనీకోయి

హె.. కొంగుముళ్ళు పడకుండానే.. 

పొంగుముదిరి పోనీకోయి

దొంగ ముద్దుల తీయదనంలొ..  

సంగతేదొ తెల్చేయ్యనీయి


ఆ.. ఆహా... హ... హ

జాబిలి వచ్చి జామయ్యింది..  ఆహా... 

జాజులు విచ్చి జామయ్యిందా?... హ... హ

తాపం పెంచే ఉడుకు దుడుకు 

ముడిపడి ఉరికే వేళయ్యింది... 

హ... హ.. గోలయ్యింది..ఆహా


లలలల... ఆహాఆహా.. హా.. హా...

ఆహాఆహా.. హా.. హా..... ఉ..ఉ..ఉ..ఉ..


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు