చెలి హృదయంలో
చిత్రం : అతని కంటే ఘనుడు (1978)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
చెలి హృదయంలో తొలి ప్రణయంలో
విరిసిన అందాలు
తొలకరి కోర్కెలు తొందర చేసిన
వలపుల బంధాలు
ఆగనా... ఇంకా ఆగనా... నీ కౌగిట దాగనా
చెలి హృదయంలో తొలి ప్రణయంలో
విరిసిన అందాలు
తొలకరి కోర్కెలు తొందర చేసిన
వలపుల బంధాలు
ఆగనా... ఇంకా ఆగనా... ఆ ఒడిలో ఊగనా
చరణం 1 :
సిరి కన్నా విలువైన మగసిరిని చూశాను
సిరిమల్లెనై పూచి ఒడిలోనే ఉంటాను
రాగాల అనురాగమై గీతాల సంగీతమై
విరబూసిన అందంలో విహరించే తుమ్మెదలా
అధరాల మధురిమలో నే తడిసి పోకుండా
ఆగనా... ఇంకా ఆగనా... ఆ ఒడిలోే ఊగనా
చరణం 2 :
ఒక యమునలా నువ్వు మెలి తిరిగిపోతావు
పడిలేచు పరువాల చెలరేగిపోతావు
ఏ కడలి కెరటానివో ఏ బ్రహ్మ రూపానివో
ఆ నీలి కన్నుల్లో నీ చూపు వెన్నెల్లో
నూరేళ్ల కౌగిళ్లు నా సొంతమవుతుంటే
ఆగనా... ఇంకా ఆగనా... నీ కౌగిట దాగనా
చెలి హృదయంలో తొలి ప్రణయంలో...
విరిసిన అందాలు
తొలకరి కోర్కెలు తొందర చేసిన...
వలపుల బంధాలు
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి