RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
krishna jayaprada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
krishna jayaprada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, ఆగస్టు 2023, గురువారం

అందాల జవ్వని మందార పువ్వని | Andala Javvani | Song Lyrics | Ooruki Monagadu (1981)

అందాల జవ్వని మందార పువ్వని 



రచన  : వేటూరి సుందరరామమూర్తి 

సంగీతం  : చక్రవర్తి 

గానం  : SP బాలు, పి సుశీల 

చిత్రం  : ఊరుకి మొనగాడు  (1981)


పల్లవి :

అందాల జవ్వని.. మందార పువ్వని...

అందాల జవ్వని.. మందార పువ్వని...

నేనంటె నువ్వని.. నువ్వంటే నవ్వని

కలిసిందిలే కన్ను కలిసిందిలే.. 

తెలిసిందిలే మనసు తెలిసిందిలే


అందాల గువ్వని... రాగాల రవ్వని..

నేనంటే నువ్వని.. నువ్వంటే నవ్వని

కలిసిందిలే కన్ను కలిసిందిలే.. 

తెలిసిందిలే మనసు తెలిసిందిలే


చరణం: 1

గోదారి నవ్వింది.. పూదారి నవ్వింది

ఆ నవ్వు ఈ నవ్వు అందాలు రువ్వింది

చిలకమ్మ నవ్వింది.. గొరవంక నవ్వింది

ఆ నవ్వు ఈ నవ్వు నెలవంకలయ్యింది

వెలుగుల్లో నీ రూపు వెన్నెళ్లు కాచే వేళ

జిలుగైన సొగసంతా సిరిపైటలేసే వేళ

చినుకంటి నీ కన్ను చిటికేసి పోయే వేళ

తెలుగుల్లో నా వలపు తొలి పాట పాడింది


అందాల గువ్వని... రాగాల రవ్వని..


చరణం: 2

వయసొచ్చి నవ్వింది.. మనసిచ్చి నవ్వింది

వలపల్లే వాలాడు పొద్దుల్లో నవ్వింది

పూరెమ్మ నవ్వింది.. పులకింతా నవ్వింది

నూగారు బుగ్గల్లో ముగ్గల్లే నవ్వింది

నీరాటి రేవుల్లో నీడల్లు ఆడే వేళ

నాలాటి ఊహల్లే మాటొచ్చి పాడె వేళ

బంగారు మలి సంధ్య రాగాలు తీసే వేళ

మబ్బుల్లో ఓ మెరుపు నను చూసి నవ్వింది

ఆ.. అహ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


పాటల ధనుస్సు 




26, డిసెంబర్ 2022, సోమవారం

చెలి హృదయంలో | Cheli Hrudayamlo | Song Lyrics | Athanikante Ghanudu (1978)

చెలి హృదయంలో



చిత్రం :  అతని కంటే ఘనుడు (1978)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆరుద్ర

నేపథ్య గానం :  బాలు, సుశీల  


పల్లవి : 


చెలి హృదయంలో తొలి ప్రణయంలో 

విరిసిన అందాలు

తొలకరి కోర్కెలు తొందర చేసిన 

వలపుల బంధాలు

ఆగనా... ఇంకా ఆగనా... నీ కౌగిట దాగనా


చెలి హృదయంలో తొలి ప్రణయంలో 

విరిసిన అందాలు

తొలకరి కోర్కెలు తొందర చేసిన 

వలపుల బంధాలు

ఆగనా... ఇంకా ఆగనా... ఆ ఒడిలో ఊగనా

 


చరణం 1 :


సిరి కన్నా విలువైన మగసిరిని చూశాను

సిరిమల్లెనై పూచి ఒడిలోనే ఉంటాను

రాగాల అనురాగమై గీతాల సంగీతమై


విరబూసిన అందంలో విహరించే తుమ్మెదలా

అధరాల మధురిమలో నే తడిసి పోకుండా

ఆగనా... ఇంకా ఆగనా... ఆ ఒడిలోే ఊగనా  



చరణం 2 : 


ఒక యమునలా నువ్వు మెలి తిరిగిపోతావు

పడిలేచు పరువాల చెలరేగిపోతావు

ఏ కడలి కెరటానివో ఏ బ్రహ్మ రూపానివో


ఆ నీలి కన్నుల్లో నీ చూపు వెన్నెల్లో

నూరేళ్ల కౌగిళ్లు నా సొంతమవుతుంటే

ఆగనా... ఇంకా ఆగనా... నీ కౌగిట దాగనా


చెలి హృదయంలో తొలి ప్రణయంలో... 

విరిసిన అందాలు

తొలకరి కోర్కెలు తొందర చేసిన... 

వలపుల బంధాలు


పాటల ధనుస్సు  


21, మార్చి 2022, సోమవారం

ఎక్కడో..చూసిన జ్ఞాపకం | Ekkado Chusina Jnapakam | Song Lyrics | Maha Sangramam (1984)

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...



చిత్రం  : మహాసంగ్రామం  (1984),

గానం  : SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల,

రచన : వేటూరి ,

సంగీతం  : చక్రవర్తి 


ఎక్కడో..చూసిన జ్ఞాపకం...

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...

ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...

అలనాటి తొలిచూపు గురిచూడగా..

కలలన్ని ఒకసారి కవ్వించగా... 

అవలీలగా..ఒక నీడగా..తను వెంటాడగా..


ఎక్కడో..చూసిన జ్ఞాపకం...

ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...

చిననాటి చిరునవ్వు చిగురించగా

ఒకనాటి బిడియాలు ఒడిచేరగా

ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా..



గోదారమ్మా..లాలాలాలా..

పోంగేనమ్మా..లాలాలాలా..

తొలినాటి వయ్యారాల పరవళ్ళలో..

కావేరమ్మా..లాలాలాలా..

కరిగేనమ్మా..లాలాలాలా..

కన్నూ కన్నూ కలిపే తీపి కన్నీటిలో

ఉయ్యాలూగే..లాలాలాలా..

ఊహల్లోనే..లాలాలాలా..

ఊరేగు ఈవేళలో....ఓ....

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...

ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...



జాబిలమ్మా..లాలాలాలా..

చిక్కేనమ్మా..లాలాలాలా..

జారేపైట..పోంగేడద..సందిళ్ళలో

ముద్దుగుమ్మా..లాలాలాలా..

మురిసేనమ్మా..లాలాలాలా..

తొలిమేనల్లో పొద్దేమరచె..కౌగిళ్ళలో

సాయంత్రాల..లాలాలాలా..

నీడల్లాంటి..లాలాలాలా..

ఆదూర తీరాలలో.....


ఎక్కడో..చూసిన జ్ఞాపకం...

ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...

చిననాటి చిరునవ్వు చిగురించగా

కలలన్ని ఒకసారి కవ్వించగా...

ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా..

ఎక్కడో..చూసిన జ్ఞాపకం...

ఎన్నడో..కలిసిన జ్ఞాపకం


పాటల ధనుస్సు 

18, జనవరి 2022, మంగళవారం

చుక్కల తోటలో ఎక్కడున్నావో | Chukkala Thotalo | Song Lyrics | Allari Bullodu (1978)

 చుక్కల తోటలో ఎక్కడున్నావో



చిత్రం: అల్లరి బుల్లోడు (1978)
సంగీతం: చక్రవర్తి
Lyrics : Veturi,
నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి: చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటాను నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను చరణం 1: నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల విరిసింది మల్లిక నా రాగ మాలిక అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత కొసరింది కోరిక అనురాగ గీతిక నీ మూగ చూపులలో...చెలరేగే పిలుపులలో నీ పట్టు విడుపులలో...సుడి రేగే వలపులలో కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి చరణం 2: ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో.. కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో.. కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు ఆ......... ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు నీలో తీగలు మీటాలి..నాలో రాగం పలకాలి లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు