ఈ రోజే ఆదివారము
చిత్రం : న్యాయం కావాలి (1981)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఈ రోజే ఆదివారము...
అవునండి మాకు తెలుసు
ఇద్దరము పడుచువారము... అవునూ ... ఐతే
ముద్దాడే మొదటీ వారము... ఏయ్.. ఇదిగో
అందించు కాస్త అందము...
ఆ.. అది మాత్రం కుదరదు
అమ్మో శరణంటినే... నన్నూ కరుణించవే
లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతి
లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతి
ఈ రోజే ఆదివారము...
సర్ టెన్లీ మేడమ్
ఎంతైనా ఆడువారము...
అఫ్ కోర్స్ అది నాకు బాగా తెలుసు
పెళ్ళాడే ప్రేమవారము...
అలా అన్నారు ఎంత బాగుంది చెప్పండి
అందాకా మనకు దూరము...
అది మాత్రం కుదిరిచావదే
అయ్యో.. ప్రేమించకు...
అపుడే.. శృతి మించకు
నో నో నో నో అందీ భారతి
నో..నో.. నో నో నో నో అందీ భారతి
చరణం 1 :
రుసరుసలోనే రుచి కలదానా
ముసిముసి నవ్వుల మధువుల వానా
రుసరుసలోనే రుచి కలదానా
ముసిముసి నవ్వుల మధువుల వానా
ముక్కు మీదనే కోపమున్నది
మక్కువైన నీ తాపమున్నది
నైసు నైసుగా పాడినా నే నైసుకానిక చూసుకో
పెళ్లైయ్యాకే ఆరాటాల పేరంటాలే చేసుకో
అందాక ఉపవాసం.. ఆపైనే సావాసం
వారం వర్జ్యం అన్నీ చూసి
వచ్చావంటే నేనే నీ సొంతం
లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతి
నో నో ... నో నో నో నో అందీ భారతి.. వై వై
చరణం 2 :
మనసిచ్చిన ఆడది మారదని
నులి వెచ్చని నీ ఒడి వీడదని
మనసిచ్చిన ఆడది మారదని
నులి వెచ్చని నీ ఒడి వీడదని
పొద్దు వాలినా ముద్దు రాలినా
పొందికైనదీ బంధమనీ
వాలు చూపుల వంతెనేసి..
కన్నె సొగసే కదలి వస్తే
కన్ను కన్ను కలిసే నాడె
కాపురాలైపోతుంటే
కౌగిట్లో కల్యాణం...
నీ కవ్వింతే నా కట్నం
మాటే మంత్రం.. మనసే మేళం..
మల్లెలో ఇల్లే సంసారం
లవ్ లవ్ లవ్ లవ్...
లవ్ మి భారతి
నో నో ... నో నో నో నో
అందీ భారతి..అబ్బా
ఈ రోజే ఆదివారము...
ఎంతైనా ఆడువారము
ముద్దాడె మొదటీ వారము...
అందాకా మనకు దూరము
అమ్మో శరణంటినే...
అపుడే.. శృతి మించకు
లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతీ
నో నో నో నో అందీ భారతి
ప్లీజ్.. లవ్ లవ్ లవ్ లవ్... లవ్ మి భారతీ
నో నో నో నో అందీ భారతి
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి