RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

9, డిసెంబర్ 2022, శుక్రవారం

ఇదే చంద్రగిరి | Ide Chandragiri | Song Lyrics | Kode Nagu (1974)

ఇదే చంద్రగిరి



చిత్రం : కోడెనాగు (1974)

సంగీతం : పెండ్యాల

గీతరచయిత : మల్లెమాల

నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి :


ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి

ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి... 

ఇదే చంద్రగిరి..

ఇదే చంద్రగిరి...  శౌర్యానికి గీచిన గిరి... 

ఇదే చంద్రగిరి... 


చరణం 1 :

తెలుగుజాతి చరితలోన  చెరిగిపోని కీర్తి సిరి 

చెరిగిపోని కీర్తి సిరి

తెలుగు నెత్తురుడికించిన వైరులకిది 

మృత్యువు గరి

ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి...   

ఇదే చంద్రగిరి 


చరణం 2 :



తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో

తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో

ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము

ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము

ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా..

ఆ... ఆ.. ఆ.. ..ఆ... ఆ.. ఆ

ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా

వెలసిన దిట స్వర్గము .. వెయ్యేళ్ళకు పూర్వము...  

వెయ్యేళ్ళకు పూర్వము

ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి.. 

ఇదే చంద్రగిరి


చరణం 3 :


ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు

ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు

రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు

రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు

ఈ మహలే కవి గాయక 

పండిత జన మండల మొకనాడు

ఈ శిధిలాలే గత వైభవ చిహ్నములై 

మిగిలిన వీనాడు

గత వైభవ చిహ్నములై 

మిగిలిన వీనాడు...  ఈనాడు....


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు