RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

7, డిసెంబర్ 2022, బుధవారం

పావురాయి పాపాయిరో | Pavurayi Papayiro | Song Lyrics | Bebbuli (1980)

పావురాయి పాపాయిరో

చిత్రం : బెబ్బులి (1980)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

దువ్వుతుంటే రివ్వుమంటూ ఎగురుతుందిరో

నవ్వుతుంటే జివ్వుమంటూ ఎలుగుతుందిరో

రివ్వునా అది నవ్వితే నాకు భలేగుందిరో...

భల్ భలేగుందిరో

చరణం 1 :

అల్లుకుంటే ఓ వెల్లువైనా 

అందాల గోదారి పొంగుందిరో

చల్లుకుంటే ఓ వెన్నెలంది... 

పరువాల జాబిల్లి రమ్మందిరో

కమ్ముకుంటే ఆ కౌగిలితే... 

కడలేని కడలల్లే పొంగిందిరో

నమ్ముకుంటే ఆ గుండెలోనే 

నా వలపు గుడి గంట మ్రోగిందిరో

అందంతో నా మదిలో అలజడులే రేపి

మనసైన మనుగడలు మీగడలు తీసి

కులికే నా చిలుకా భల్ భలేగుందిరో..

భల్ భలేగుందిరో

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

చరణం 2 :

వానలాగా నావాడు వస్తే...

వయసనక మనసంతా తడిసిందిరో

ఎండలాగా నావాడు చూస్తే...

నా ఒళ్ళు హరివిల్లు విరిసిందిరో

నేల మీద ఓ మెరుపులాగా...

నడిచిందా నా ఈడు ఉరిమిందిరో

నింగిలోనీ ఆ చుక్కలాగా

పొడిచిందా నా కోడి కూసిందిరో

తొలివలపు తొందరల పందిళ్లు వేసి

చేయ్ వెలితి చెరి సగమై చెలిమంతా చూసే

మనసు అది వయసో భల్ భలేగుందిరో...

భల్ భలేగుందిరో 

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

దువ్వుతుంటే రివ్వుమంటూ ఎగురుతుందిరో

నవ్వుతుంటే జివ్వుమంటూ ఎలుగుతుందిరో

రివ్వునా అది నవ్వితే నాకు భలేగుందిరో...

భల్ భలేగుందిరో

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు