నిన్ను చూసింది మొదలూ
చిత్రం : నేనే మొనగాణ్ణి (1968 )
సంగీతం : TV రాజు
రచన : సి నారాయణరెడ్డి
గానం : NT రామారావు, పి సుశీల
పల్లవి :
నిన్ను చూసింది మొదలూ
కలలే కలలు కలలే కలలూ
నిన్ను వలచింది మొదలూ
ఎదలో అలలూ అలలే అలలు
నిన్ను చూసింది మొదలూ
కలలే కలలా ఎదలో అలలే అలలా
ఎందుకు చెలీ
చరణం : 1
నడిరేయి నీ చేయి
నడిరేయి నీ చేయి
నను తాకెనని ఎంచినాను
శివకోటి గగనాల తిలకించినాను
నేనేమి కన్నాను అపుడు
నీ మోము పదహారు కళలు
కళలే కళలు కళలే కళలు
నిన్ను చూసింది మొదలూ
కళలే కళలు కళలే కళలు
నిన్ను వలచింది మొదలూ
ఎదలో అలలు అలలే అలలు
నిన్ను చూసింది మొదలూ
చందమామలో
నన్ను కన్నావా చందన గంటి
ఆపై ఏం జరిగింది వెన్నెల కరిగిందా
చరణం : 2
చిరు జల్లులో ఊగు
మరుమల్లెలా తూగినాను
దరిలేని సెలయేటి కెరటమ్మునై సాగినాను
నేనేమి కన్నాను అపుడు
నా నిలువెల్లా నీ చూపు వలలు
వలలే వలలు వలలే వలలు
నిన్ను చూసింది మొదలూ
కలలే కలలు
నిన్ను వలచింది మొదలూ
ఎదలో అలలూ అలలే అలలు
నిన్ను చూసింది మొదలూ
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి