RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, డిసెంబర్ 2022, గురువారం

ఆకాశంలో తారా తారా ముద్దాడే | Akasamlo Taratara Muddade | Song Lyrics | Shivudu Shivudu Shivudu (1983)

ఆకాశంలో తారా తారా ముద్దాడే



చిత్రం:  శివుడు శివుడు శివుడు (1983)

సంగీతం:  చక్రవర్తి

గీతరచయిత:  వేటూరి

నేపధ్య గానం:  బాలు, సుశీల 



పల్లవి :


ఆకాశంలో తారా తారా ముద్దాడే.. 

పెళ్ళాడే అందాలతో.. బంధాలతో..ఓ

ఓ..ఓఓఓ ఓఓఓ ఓఓఓ

కైలాసంలో గౌరీ శివుడూ 

ఈనాడే పెళ్ళాడే మేళాలతో.. తాళాలతో..ఓ

హో..ఓఓఓ ఓఓఓ ఓఓఓ


చరణం 1 :


ఈ పూల గంధాలలోనా..

ఏ జన్మ బంధాలు కురిసే..ఏ.. ఏ

ఆ జన్మ బంధాలతోనే  

ఈ జంట అందాలు తెలిసే..ఏ.. ఏ

వలచే వసంతాలలోనే..

మమతల పందిరి వేసుకుని 

మల్లెలలో తలదాచాలి

మనసులతో ముడి వేసుకుని.. 

బ్రతుకులతో మనువాడాలి

శృతి..లయ సరాగమై..కొనసాగాలి


ఆకాశంలో తారా తారా ముద్దాడే..

పెళ్ళాడే అందాలతో..ఓ..

లల్లాలలా..ఆ..బంధాలతో....

ఓఓఓ..హే..ఏ.. ఏ

కైలాసంలో గౌరీ శివుడూ 

ఈనాడే పెళ్ళాడే మేళాలతో..ల..ల

లల్లాలలా..ఆ..తాళాలతో..ఓ..ఓఓఓఓఓ



చరణం 2 :


తెల్లారు ఉదయాలలోన..

గోరంత పారాణి తీసి.. ఈ.. ఈ

ఆరాణి పాదాలలోనే..  

పరువాల నిట్టూర్పు చూసి..ఈ... ఈ

ఈ తీపి కన్నీటిలోనే..  

కరిగిన ఎదలను చూసుకుని

కలలకు ప్రాణం పోయాలి

తనువుల అల్లిక నేర్చుకుని..

పెళ్ళికి పల్లకి తేవాలి

స్వరం..పదం..కళ్యాణమై..జత కావాలి

ఆకాశంలో తారా తారా ముద్దాడే..

పెళ్ళాడే అందాలతో లాలలలా.. 

బంధాలతో..లాలలలా..ఆ

కైలాసంలో గౌరీ శివుడూ 

ఈనాడే పెళ్ళాడే మేళాలతో..ఓఓఓ

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..తాళాలతో..

ఓఓఓ..లలాలలా


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు