RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, మార్చి 2025, గురువారం

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ | Eenade Babu Nee Puttinaroju | Song Lyrics | Tata Manavadu (1973)

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ



చిత్రం :  తాతా మనవడు (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

ఈ ఇంటికే.. ఈ  ఇంటికే 

కొత్త వెలుగు వచ్చినరోజూ

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


చరణం 1 :


చిన్నబాబు ఎదిగితె...  

కన్నావరి కానందం..

నెలవంక పెరిగితె...  

నింగికే ఒక అందం

చుక్కలు వేయెందుకు 

ఒక్క చంద్రుడే చాలు..

చుక్కలు వేయెందుకు 

ఒక్క చంద్రుడే చాలు

తనవంశం వెలిగించె 

తనయుడొకడె పదివేలు 


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

ఈ ఇంటికే.. ఈ  ఇంటికే 

కొత్త వెలుగు వచ్చినరోజూ

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


చరణం 2 : 


కన్నవారి కలలు తెలుసుకోవాలీ.. 

ఆ కలలు కంటనీరు పెడితె 

తుడవాలీ

కన్నవారి కలలు తెలుసుకోవాలీ.. 

ఆ కలలు కంటనీరు పెడితె 

తుడవాలీ

తనకుతాను సుఖపడితే 

తప్పుగాకున్నా.. 

తనవారిని సుఖపెడితే 

ధన్యత ఓ నాన్నా   


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


చరణం 3 : 


తండ్రి మాటకై కానకు 

తరలిపోయె రాఘవుడూ.. 

అందుకే ఆ మానవుడు 

ఐనాడు దేవుడూ 

తల్లి చెరను విడిపించగ 

తలపడె ఆ గరుడుడూ.. 

అందుకె ఆ పక్షీంద్రుడు 

అంతటి మహానీయుడూ


ఓ బాబూ నువ్వూ ఆ బాటనడవాలి.. 

ఓ బాబూ నువ్వూ ఆ బాటనడవాలి

భువిలోన నీ పేరు 

ధృవతారగా వెలగాలీ.. 

ధృవతారగా వెలగాలీ   


ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

ఈ ఇంటికే.. ఈ  ఇంటికే 

కొత్త వెలుగు వచ్చినరోజూ

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ


- పాటల ధనుస్సు 


1 కామెంట్‌:

  1. ఇది ఒక పాట కాదు పాటని అడ్డు పెట్టి ఒక సందేశం మనవడికి ఎలా ఉండాలో చెబుతూనే తన కొడుకుకి ఇలా ఉండకూడదు అని చెప్పటం మనవడికి కి కొడుక్కి ఒకే పాటతో చెప్పటం సి నారాయణ రెడ్డి గారి రచన అద్భుతం ఇటువంటి పాటలు ఇప్పుడు రావు కూడా

    రిప్లయితొలగించండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గువ్వలాంటి చిన్నది | Guvvalanti Chinnadi | Song Lyrics | Lakshmi Nivasam (1968)

గువ్వలాంటి చిన్నది  చిత్రం: లక్ష్మీ నివాసం (1968) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల పల్లవి: గువ్వలాంటి చిన్నది  తారా జు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు