వద్దురా చెప్పుకుంటే సిగ్గురా
చిత్రం : ఖైదీ కాళిదాసు (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : జానకి
పల్లవి :
వద్దురా చెప్పుకుంటే సిగ్గురా...
గుట్టుగా దాచుకుంటే ముప్పురా
వద్దురా చెప్పుకుంటే సిగ్గురా...
గుట్టుగా దాచుకుంటే ముప్పురా
పేరైనా చెప్పలేదు సచ్చినోడు...
సంతలోని ఆణ్ణి చూసి..
నా తెలివి సంతకెళ్లే
వద్దురా చెప్పుకుంటే సిగ్గురా... అబ్బా...
గుట్టుగా దాచుకుంటే ముప్పురా
చరణం 1 :
సరసకు వచ్చాడు... హా...
చనువుగ నవ్వాడు
మాటల గారడితో...
నను మాయ చేశాడు
సరసకు వచ్చాడు... హా...
చనువుగ నవ్వాడు
మాటల గారడితో...
నను మాయ చేశాడు
తప్పిపోతావన్నాడు...
జట్టుకట్టకున్నాడు
జారిపోతాదన్నాడు...
కొంగుపట్టుకున్నాడు
చుక్కలెన్నో చూపాలంటూ
కళ్ళుమూయమన్నాడు
చుక్కలెన్నో చూపాలంటూ
కళ్ళుమూయమన్నాడు
ఒళ్ళు తెలిసే లోపుగానే
ఒళ్ళు నాకే ఆరిపోయే
వద్దురా చెప్పుకుంటే సిగ్గురా... అబ్బా...
గుట్టుగా దాచుకుంటే ముప్పురా
చరణం 2 :
అడుగులు పడవాయే... హా..
నడుములు బరువాయే..హా
నాకు నా ఒళ్లే మాటవినదాయే
అడుగులు పడవాయే... హా..
నడుములు బరువాయే..హా
నాకు నా ఒళ్లే మాటవినదాయే
పదారేళ్లు నా పరువం
పొట్టనెట్టుకున్నాడు
పదారేళ్లు నా పరువం
పొట్టనెట్టుకున్నాడు
ఎందుకో వాడంటే కోపమే రాకుంది
ఎందుకో వాడంటే కోపమే రాకుంది
తప్పు చేసిన పోకిరీనే
తండ్రిగా చేయాలనుంది
వద్దురా చెప్పకుంటే సిగ్గురా...
గుట్టుగా దాచుకుంటే ముప్పురా
పేరైనా చెప్పలేదు సచ్చినోడు...
సంతలోని ఆణ్ణి చూసి..
నా తెలివి సంతకెళ్లే
వద్దురా చెప్పుకుంటే సిగ్గురా... అబ్బా...
గుట్టుగా దాచుకుంటే ముప్పురా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి