నీ లీలలోనే ఒక హాయి లే
చిత్రం : ఉమా చండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీతరచయిత: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
నీ లీలలోనే ఒక హాయి లే
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే
నీ లీలలోనే ఒక హాయి లే
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే
చరణం 1:
నీవున్న చోటే స్వర్గాలుగా
భువనాలనేలా నా కేలలే
దివినైనా ఏలే పతి ఉండగా
ఏ వైభవాలూ నాకునూ ఏలలే ఏ ఏ ఏ ఏ
నీ లీలలోనే ఒక హాయి లే
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓహోహో
చరణం 2:
ఆహా
ఒహోహోహో హో హో
ఆహా హా
ఒహో
అహహా హ హ హ
నా విందు నీవై చెలువొందగా
ఏ చందమామే నా కేలలే
నా వెలుగు నీవై విలసిల్లగా
ఏ వెన్నెలైనా నాకునూ ఏలలే ఏ ఏ ఏ
నీ లీలలోనే ఒక హాయి లే
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే
చరణం 3:
నీ వలపు వాహినిలో నే తేలగా
ఏ కేళియైనా నా కేలలే
నీ ప్రేమ లాహిరిలో నే సోలగా
ఏ లాలనైనా నాకునూ ఏలలే ఏ ఏ ఏ
నీ లీలలోనే ఒక హాయి లే
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి