RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, జులై 2024, ఆదివారం

చినుకు చినుకు పడుతూ వుంటే | Chinuku chinuku paduthuvunte | Song Lyrics | Iddaru Asadhyle (1979)

చినుకు చినుకు పడుతూ వుంటే



చిత్రం : ఇద్దరూ అసాధ్యులే (1979)

రచన :  ఆచార్య ఆత్రేయ,

సంగీతం : సత్యం,

గానం : SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల,


పల్లవి :


చినుకు చినుకు పడుతూ వుంటే.

తడిసి తడిసి ముద్దవుతుంటే

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ

ఒకరికొకరు చలిమంటైతే

అయితే!


జోహారు జోహారు ఈ వానకూ.

ఈ హాయి లేదోయి ఏ జంటకూ.

చినుకు చినుకు పడుతూ వుంటే

తడిసి తడిసి ముద్దవుతుంటే

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ.

ఒకరికొకరు చలిమంటైతే.

అయితే!


జోహారు జోహారు ఈ వానకూ.

ఈ హాయి లేదోయి ఏ జంటకూ.


చరణం 1:


చెయ్యి నడుము చుట్టేస్తుంటే

చంప చంప నొక్కేస్తుంటే

చిక్కు కురులు చిక్కం వేయగా.ఆ.ఆ...

చెయ్యి నడుము చుట్టేస్తుంటే

చంప చంప నొక్కేస్తుంటే


చిక్కు కురులు చిక్కం వేయగా... ఆఆ.

ఆఆ.ఆఆ. ఊపిరాడలేదని నువ్వు

ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంటే

జేజేలు జేజేలు ఈ రోజుకూ

ప్రతి రోజు ఈ రోజు అయ్యేందుకూ

చినుకు చినుకు పడుతూ వుంటే


ఆ ఆఆ.

తడిసి తడిసి ముద్దవుతుంటే

ఆ .ఆఆ

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ

ఆ . ఆఆ

ఒకరికొకరు చలిమంటైతే

జోహారు జోహారు ఈ వానకూ

ఈ హాయి లేదోయి ఏ జంటకూ


చరణం 2:


సొంపులన్నీ దాచే మేర..

ఒంటినంటి ఉన్నది చీర

తొలగిపోతే రట్టవుతుందిరా... ఆ . ఆఆ

సొంపులన్నీ దాచే మేర..

ఒంటినంటి ఉన్నది చీర

తొలగిపోతే రట్టవుతుందిరా.. ఆఆ.

ఆఆ.ఆఆ.గుట్టుగున్న నిను చూస్తుంటే

కోంటె కోర్కె నాకొస్తుంటే


పదునైన పరువాన్ని ఆపేందుకూ

పగ్గాలు లేవింక జంకెందుకూ

చినుకు చినుకు పడుతూ వుంటే.

ఆఆ .హా..


తడిసి తడిసి ముద్దవుతుంటే.

ఆఆ. హా

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ

.ష్. ఆఆ. హా..

ఒకరికొకరు చలిమంటైతే

జోహారు జోహారు ఈ వానకు.

ఈ హాయి లేదోయి ఏ జంటకూ.


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు