RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, జులై 2024, మంగళవారం

ముందు తెలిసెనా ప్రభూ | Mundu Telisena Prabhu | Song Lyrics | Megha Sandesam (1982)

ముందు తెలిసెనా ప్రభూ



చిత్రం :  మేఘసందేశం (1982)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


ముందు తెలిసెనా ప్రభూ..

ఈ మందిరమిటులుంచేనా ... 

మందమతిని

నీవు వచ్చు మధుర క్షణమేదో

కాస్త .. ముందు తెలిసెనా ప్రభూ 


ముందు తెలిసెనా ప్రభూ..

ఈ మందిరమిటులుంచేనా ... 

మందమతిని

నీవు వచ్చు మధుర క్షణమేదో

కాస్త .. ముందు తెలిసెనా ప్రభూ .. 


చరణం 1:


అందముగా నీ కనులకు 

విందులుగా వాకిటనే....

అందముగా నీ కనులకు 

విందులుగా వాకిటనే.. 


సుందర మందారకుంద 

సుమదళములు పరువనా

సుందర మందార కుంద 

సుమదళములు పరువనా

దారి పొడుగునా తడిసిన 

పారిజాతములపై

నీ అడుగుల గురుతులే 

నిలిచినా చాలును..


ముందు తెలిసెనా ప్రభూ..

ఈ మందిరమిటులుంచేనా ... 

మందమతిని

నీవు వచ్చు మధుర క్షణమేదో

కాస్త .. ముందు తెలిసెనా ప్రభూ ... 


చరణం 2:


బ్రతుకంతా ఎదురుచూచు 

పట్టున రానే రావు

బ్రతుకంతా ఎదురుచూచు 

పట్టున రానే రావు


ఎదురరయని వేళ వచ్చి 

ఇట్టే మాయమౌతావు

ఎదురరయని వేళ వచ్చి 

ఇట్టే మాయమౌతావు

కదలనీక నిముసము నను 

వదలిపోక నిలుపగా

నీ పదముల బంధింపలేను 

హృదయము సంకెల జేసి...


ఈ మందిరమిటులుంచేనా ... 

మందమతిని

నీవు వచ్చు మధుర క్షణమేదో

కాస్త .. ముందు తెలిసెనా ప్రభూ ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు