ఏమండి సారూ ఓ బట్లర్ దొరగారు
చిత్రం - నేరము శిక్ష (1973),
నటీనటులు - కృష్ణ, భారతి,
సాహిత్యం - దాశరధి,
గానం - S.P. బాలసుబ్రహ్మణ్యం, S. జానకి,
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు,
దర్శకత్వం - కె.విశ్వనాథ్,
పల్లవి:
ఏమండి సారూ ఓ బట్లర్ దొరగారు
అన్ని తెలుసనీ అన్నారు
ఎన్నో కోతలు కోశారు
ఇంతేనా మీ పనితనమింతేనా
ఏమండి సారూ ఓ బట్లర్ దొరగారు
అన్ని తెలుసనీ అన్నారు
ఎన్నో కోతలు కోశారు
ఇంతేనా మీ పనితనమింతేనా
ఇంతేనా మీ పనితనమింతేనా
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అంతటి మాట అనకండి
ఆఖరు దాకా ఆగండి
చూడండి నా పనితనమేదో చూడండి
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అంతటి మాట అనకండి
ఆఖరు దాకా ఆగండి
చూడండి నా పనితనమేదో చూడండి
చూడండి నా పనితనమేదో చూడండి
చరణం 1 :
బీర కంద చామా
ఏ కూరైనా ఒకటే రుచి ఓ రామా
కోడి పులావు కుర్మా
తిందామంటే నల్లుల వాసనా ఓ ఖర్మా
ఎరువులు వేసిన కాయగూరలు
ఎవరు వండిన అంతేనమ్మా
కమ్మని రుచులు కావాలంటే
కల్తీలేని శాల్తీ లీచ్చి చూడండి
నా పనితనం మేదో చూడండి
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అందాకా ఈ ప్రాణం నిలిచేనా
ఏమండి సారూ ఓ బట్లర్ దొరగారు
అన్ని తెలుసనీ అన్నారు
ఎన్నో కోతలు కోశారు
ఇంతేనా మీ పనితనమింతేనా
అంతటి మాట అనకండి
ఆఖరు దాకా ఆగండి
చూడండి నా పనితనమేదో చూడండి
చరణం 2:
మనసు మమతా మంచి
కలిపి దేవుడు వండిన వంటే మనిషి
ఎందుకు ఉప్పు కారం
మీలోనే వున్నది కమ్మని మమకారం
తియ్యటి మాటలతోటి
తీరునటయ్య ఆకలి
చేతులలోనే చూపాలి
నీ చేతి మహత్యం తెలపాలి
ఏమండి సారూ ఓ బట్లర్ దొరగారు
అన్ని తెలుసనీ అన్నారు
ఎన్నో కోతలు కోశారు
ఇంతేనా మీ పనితనమింతేనా
అహహా
చూడండి నా పనితనమేదో చూడండి
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి