ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
చిత్రం : జమదగ్ని (1988)
రచన : సాహితి ,
సంగీతం : ఇళయరాజా
గానం : మనో , S జానకి ,
పల్లవి :
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు వాటేసి వెళ్ళు
పెళ్ళాడే వాడా పెనవేసే తోడా
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
నీ నీలి కళ్ళు అవునంటే చాలు
అల్లాడే దానా అలవాటైపోనా..
ఇది స్వాతి జల్లు
చరణం 1:
నీలి కోక నీటికి తడిసే
పైట గుట్టు బైటపడే
పెళ్ళి కాని పిల్లకి చలితో
పెద్ద చిక్కు వచ్చి పడే
నీలి కోక నీటికి తడిసే
పైట గుట్టు బైటపడే
పెళ్ళి కాని పిల్లకి చలితో
పెద్ద చిక్కు వచ్చి పడే
కన్నె ఈడు కాగిపోయెరా...
పడిన నీరు ఆవిరాయెనా
నాలో తాకే గిలిగింతే
గంతే వేసే ఇన్నాళ్ళూ
నీకై కాచే వయసంతా మల్లై పూచే
కౌగిట్లో నీ ముంత కొప్పంత
రేపేయనా తీపంత చూపేయనా
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు
చరణం 2:
చిన్నదాని అందాల నడుమే
సన్నగుంది ఎందుకని
అందగాని చేతికి ఇట్టే
అందుతుంది అందుకని
చిన్నదాని అందాల నడుమే
సన్నగుంది ఎందుకని
అందగాని చేతికి ఇట్టే
అందుతుంది అందుకని
బుగ్గమీద సొట్ట ఎందుకే
సక్కనోడి తీపి ముద్దుకే
నాకివ్వాళా సోయగాల సోకివ్వాలా
శోభనాల రేయవ్వాల
యవ్వనాల హాయివ్వాలా
ఈ పూటా మన జంట చలిమంట
కాగాలిరా గిల్లంత తీరాలిరా
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు వాటేసి వెళ్ళు
అల్లాడే దానా అలవాటైపోనా..
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లూ...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి