ప్రణయ రాగ వాహిని
చిత్రం : మాయా మశ్చీంద్ర (1975)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
ప్రణయ రాగ వాహిని..చెలీ..
వసంత మోహిని..
ప్రణయ రాగ వాహిని..చెలీ..
వసంత మోహిని..
మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ..
ప్రణయ రాగజీవనా...ప్రియా...
వసంత మోహనా..
చరణం 1:
ఆ.. ఆ.. ఆ.. ఆ..
మలయ పవన మాలికలు..
చెలియా పలికే ఏమని..
మలయ పవన మాలికలు..
చెలియా పలికే ఏమని..
పొదరింట లేడు..పూవింటి వాడు..
పొదరింట లేడు..పూవింటి వాడు..
ఎదురుగా వున్నాడనీ..
ప్రణయ రాగ వాహిని..చెలీ..
వసంత మోహిని..
చరణం 2:
లలిత శారద చంద్రికలు..
అలలై పాడేను ఏమనీ..
లలిత శారద చంద్రికలు..
అలలై పాడేను ఏమనీ..
పదునారు కళలా..
పరువాల సిరులా
పదునారు కళలా..
పరువాల సిరులా
పసిడి బొమ్మవు నీవనీ..
ప్రణయ రాగ వాహిని..చెలీ..
వసంత మోహిని..
మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ..
ప్రణయ రాగజీవనా...ప్రియా...
వసంత మోహనా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి