RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, జులై 2024, శుక్రవారం

కరిగిపొమ్మంది ఒక చినుకు | Karigipommandi Oka Chinuku | Song Lyrics | Dharma Chakram (1980)

కరిగిపొమ్మంది ఒక చినుకు 



చిత్రం: ధర్మచక్రం (1980) 

సంగీతం: సత్యం 

గీతరచయిత: మైలవరపు గోపి 

నేపథ్య గానం: బాలు, సుశీల 


పల్లవి :


కరిగిపొమ్మంది ఒక చినుకు 

కలిసి పొమ్మంది ఒక మెరుపు

ఈ చలిలోనీ ఒడిలో తీయని కౌగిలిలో

కరిగిపొమ్మంది ఒక చినుకు 

కలిసి పొమ్మంది ఒక మెరుపు

ఈ చలిలోనీ ఒడిలో తీయని కౌగిలిలో

కరిగిపొమ్మంది ఒక చినుకు

కలిసి పొమ్మంది ఒక మెరుపు


చరణం 1 :


నడకే మయూరమాయే 

నడుమే వయ్యారమాయే

మెరుపుగా మారిపోనా 

నీ కళ్ళలో కలిసిపోనా

మైకం ఒకింత మైకం 

బిడియం రవంత బిడియం

చినుకుగా మారిపోనా 

నీ గుండెపై చేరిపోనా

కరిగిపొమ్మంది ఒక చినుకు

కలిసి పొమ్మంది ఒక మెరుపు


చరణం 2 :


తడిసే చకోరి సొగసు 

పొంగే పదారు వయసు

నా పెదవి కోరుతోంది 

తొలి ముద్దు కోరుతోంది

రానీ ముహూర్త సమయం 

కలలే ఫలించు తరుణం

వలపే నివాళి చేసి 

నిలువెల్ల అల్లుకోనా

కరిగిపొమ్మంది ఒక చినుకు

కలిసి పొమ్మంది ఒక మెరుపు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే | Godariki Ye oddaina | Song Lyrics | Mana Oori Katha (1976)

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే చిత్రం :  మన ఊరి కథ (1976) సంగీతం :  జె.వి. రాఘవులు గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం :  బాలు, సుశీల  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు