నీ ఎదుట నేను వారెదుట నీవు
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: సుశీల
పల్లవి:
చందమామా ....అందాల మామా...
నీ ఎదుట నేను...వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా..
ఎప్పుడుంటావు...
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా..
ఎప్పుడుంటావు...
చరణం 1:
పెళ్ళిచూపులకు వారొచ్చారు..
చూడాలని ..నే ఓరగ చూశా..
పెళ్ళిచూపులకు వారొచ్చారు...
చూడాలని.. నే ఓరగ చూశా ...
వల్లమాలినా సిగ్గొచ్చింది..
కన్నుల దాకా.. కన్నులు పోక
మగసిరి ఎడదనె చూశాను .....
మగసిరి ఎడదనె చూశాను...
తల దాచుకొనుటకది చాలన్నాను...
నీ ఎదుట నేను...వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా...
ఎప్పుడుంటావు...
చరణం 2:
పెళ్ళిచూపులలో బిగుసుకొని...
పేరేమి..చదువేమి..
ప్రేమిస్తావా..వయసెంతా
పెళ్ళిచూపులలో బిగుసుకొని...
పేరేమి..చదువేమి..
ప్రేమిస్తావా..వయసెంతా
అని అడిగారా ....అసలొచ్చారా.....
నాలో వారు ఏం చూశారో ..
నావారయ్యారు...
నాలో వారు ఏం చూశారో ..
నావారయ్యారు..
అందులకే మా ఇద్దరి జంట..
అపురూపం అంటా...
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా...
ఎప్పుడుంటావు...
చరణం 3:
చల్లని వెన్నెల దొరవంటారు..
తీయని నవ్వుల సిరివంటారు...
చల్లని వెన్నెల దొరవంటారు..
తీయని నవ్వుల సిరివంటారు...
ఆ వెన్నెలలోని వేడిగాడ్పులు...
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను .....
అనుభవించి అనమంటాను..
వయసుకు వైరివి నీవంటాను
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా
ఎప్పుడుంటావు....
చందమామా ....అందాల మామా.....
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి