RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, జులై 2024, శనివారం

ఏమిటో ఈ మాయా | Emito Ee Maya | Song Lyrics | Uma Chandi Gowri Sankarula Katha (1968)

ఏమిటో ఈ మాయా కలలోని కథవలెనాయే



చిత్రం : ఉమా చండి గౌరి శంకరుల కథ (1968)

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 

గీతరచయిత:  పింగళి నాగేంద్రరావు

గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఏమిటో ఈ మాయా... 

కలలోని కథవలెనాయే...

ఏమిటో ఈ మాయా... 

కలలోని కథవలెనాయే

ఏమిటో ఈ మాయా...


వాణినరసి వానినొరసి 

మనసు విరిసేనే

తానుగా నను తాకెనే 

అది నిజమే కారాదా...


ఏమిటో ఈ మాయా... 

కలలోని కథవలెనాయే

ఏమిటో ఈ మాయా...


చరణం 1:


నాటిదో ఏనాటిదో 

నేటి ఈ చెలిమి.. ఈ.. ఈ..

మేలుగా ఒక లీలగా 

కల నిజమే కారాదా...

ఏమిటో ఈ మాయా... 

కలలోని కథవలెనాయే

ఏమిటో ఈ మాయా...

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ.. ఆ.. ఆ..


కనులు కలిసి మనసు తెలిసి 

మేనులే సొలసి...

కనులు కలిసి మనసు తెలిసి 

మేనులే సొలసి...

ఉంటిమని కలగంటి కదా... 

అది నిజమే కారాదా...


ఏమిటో ఈ మాయా... 

కలలోని కథవలెనాయే

ఏమిటో ఈ మాయా...


చరణం 2:


ఎన్ని జన్మల పరిచయముతో 

నన్ను పిలిచేనో సఖీ...

ఎన్ని జన్మల పరిచయముతో 

నన్ను పిలిచేనో

మేలుగా ఒక లీలగా 

కల నిజమే కారాదా...


ఏమిటో ఈ మాయా... 

కలలోని కథవలెనాయే

ఏమిటో ఈ మాయా...


చరణం 3:


వరుని కొరకై జీవితమంతా 

విరహ బాధయేనా

వరుని కొరకై జీవితమంతా 

విరహ బాధయేనా

మాయయే మటుమాయమై 

కల నిజమే కారాదా...


ఏమిటో ఈ మాయా... 

కలలోని కథవలెనాయే

ఏమిటో ఈ మాయా...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు