RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, జులై 2024, శనివారం

ఎవరీ చక్కనివాడు | Evaree Chakkanivadu | Song Lyrics | Khaidi Kalidasu (1977)

ఎవరీ చక్కనివాడు



చిత్రం: ఖైదీ కాళిదాసు (1977) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: మైలవరపు గోపి 

నేపథ్య గానం: బాలు, సుశీల 


పల్లవి : 


ఓ.. హొ.. ఓఓఓ.. హొ.. ఓఓ.. హొ.. హా 


ఎవరీ చక్కనివాడు.. 

ఎంతకూ చిక్కనివాడు.. 

ఎప్పటికి దారికొస్తాడో.. 


ఎవరీ చక్కని చుక్క.. 

సోకు దీని కాలికి మొక్క.. 

కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. 

కాదన్నా వెంటపడుతోందీ 

ఆఆ.. ఆ..ఆ


ఎవరీ చక్కనివాడు.. 

ఎంతకూ చిక్కనివాడు.. 

ఎప్పటికి దారికొస్తాడో.. 


ఎవరీ చక్కని చుక్క.. 

సోకు దీని కాలికి మొక్క.. 

కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. 

కాదన్నా వెంటపడుతోందీ 


చరణం 1 : 


కదలిక వుంది.. 

మబ్బులో కదలిక వుంది.. 


నీటికీ వేగం వుంది.. 

గాలికీ చలనం వుంది.. 


వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుంది


కదలిక వుంది మబ్బులో కదలిక వుంది 

నీటికీ వేగం వుంది గాలికీ చలనం వుంది 

వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుంది


వయసొచ్చింది.. 

దానితో వలపొచ్చింది.. హా.. ఆ.. ఆ.. 

వయసొచ్చింది.. దానితో వలపొచ్చింది 


అందుకే చిన్నది తొందర పడుతోంది.. 

అందుకే చిన్నది తొందర పడుతోంది

ఆఆ..ఆఆ.. అ 


ఎవరీ చక్కనివాడు.. 

ఎంతకూ చిక్కనివాడు.. 

ఎప్పటికి దారికొస్తాడో.. 


ఎవరీ చక్కని చుక్క.. 

సోకు దీని కాలికి మొక్క.. 

కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. 

కాదన్నా వెంటపడుతోందీ 


చరణం 2 : 


కన్నేసింది.. కళ్ళతో కట్టేసింది.. 


చూపుతో చంపేస్తుంది.. 

నవ్వుతో బ్రతికిస్తుంది 

అమ్మమ్మో.. కుర్రది చాలా టక్కరిది 


కన్నేసింది కళ్ళతో కట్టేసింది 

చూపుతో చంపేస్తుందీ 

నవ్వుతో బ్రతికిస్తుంది 

అమ్మమ్మో..కుర్రది చాలా టక్కరిది


వీడితో ఔననిపించి.. 

కొంగుముడి వెయ్యకపోతే 


వీడితో ఔననిపించి.. 

కొంగుముడి వెయ్యకపోతే 


ఎందుకీ ఆడజన్మ వోయమ్మా.. 

ఎందుకీ ఆడజన్మ వోయమ్మా.. 

ఆఆ..ఆఆ.. ఆఆ 


ఎవరీ చక్కనివాడు.. 

ఎంతకూ చిక్కనివాడు.. 

ఎప్పటికి దారికొస్తాడో.. 


ఎవరీ చక్కని చుక్క.. 

సోకు దీని కాలికి మొక్క.. 

కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. 

కాదన్నా వెంటపడుతోందీ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు