దివి నుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై...
దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై...
గుడిలోని ప్రతిమ...వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో ...నీవై నీవై
గుడిలోని ప్రతిమ...వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో ...నీవై నీవై...
దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై...
చరణం 1:
అందని జాబిలి అందాలు పొందాలి..
అనుకున్నా ఒకనాడు..ఆనాడు
అందని జాబిలి అందాలు పొందాలి..
అనుకున్నా ఒకనాడు ..ఆనాడు
అందిన జాబిలి పొందులో అందాలు...
అందిన జాబిలి పొందులో అందాలు...
పొందాను...ఈనాడు...ఈనాడు..
పొందాను...ఈనాడు...ఈనాడు
దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై..
చరణం 2:
కనరాని దేవుని కనులా చూడాలని..
కలగంటిని ఒకనాడు ..ఆనాడు..
కనరాని దేవుని కనులా చూడాలని..
కలగంటిని ఒకనాడు ...ఆనాడు
కలనిజం చేసి..కౌగిలిలో చేర్చి..
కలం నిజం చేసి..కౌగిలిలో చేర్చి
కరిగించెను..ఈనాడు...ఈనాడు..
కరిగించెను..ఈనాడు...ఈనాడు
గుడిలోని ప్రతిమ...వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో ...నీవై నీవై
చరణం 3:
కడలిలో పుట్టావు..అలలపై తేలావు..
నురగవై వచ్చావు..ఎందుకో..
కడలిలో పుట్టావు.. అలలపై తేలావు..
నురగవై వచ్చావు ..ఎందుకో..ఓ..
కడలి అంచువు నిన్ను.. కలిసి నీ ఒడిలో...
కడలి అంచువు నిన్ను.. కలిసి నీ ఒడిలో...
ఒరిగి కరగాలనే... ఆశతో
దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై..
గుడిలోని ప్రతిమ...వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో ...నీవై నీవై
దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి